calender_icon.png 2 October, 2024 | 7:56 AM

ధాన్యం సేకరణకు మిల్లర్లు సహకరించాలి

02-10-2024 01:31:57 AM

కొనుగోలు కేంద్రాల వద్ద శుద్ధియంత్రాలు ఏర్పాటు 

పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్

హైదరాబాద్, అక్టోబర్ 1(విజయక్రాంతి): రైతులకు ఎలాంటి ఇబ్బం దులు కలగకుండా ధాన్యం సేకరణ చేపట్టాలని, మిల్లర్లు పూర్తిగా సహకరించాలని పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ సూచించారు. మంగళవారం తన కార్యాల యంలో రాష్ట్ర మిల్లర్ల సంఘం నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సన్నబియ్యం సేకరణను చాలెంజ్‌గా తీసుకోవాలని చెప్పారు.

ప్రభుత్వం జనవరి నుంచి రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం పం పణీకి సిద్ధమైందని తెలిపారు.  జిల్లా అధికారులు, మిల్లర్లు కొనుగోళ్లలో ప్రభుత్వానికి సహకరిస్తే టార్గెట్ పూర్తి చేయవచ్చన్నారు. ఈసారి కొనుగోలు కేంద్రాల వద్ద శుద్ధి యంత్రాల ను ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. ఇప్పటికే 10 కోట్ల గన్నీ బ్యాగులు తీసుకొచ్చేందుకు ఆర్డర్లు ఇచ్చినట్టు తెలిపారు.

మిల్లర్ల వద్ద ఉన్న సన్నధాన్యం పూర్తిగా ప్రభుత్వానికి ఇవ్వా లని, ఇతర రాష్ట్రాలకు అమ్మితే సహి ంచబోమని హెచ్చరించారు. ధాన్యం లో తేమ శాతం 17 నుంచి 14 శాతం వరకు తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తామని మిల్లర్లుకు హామీ ఇచ్చారు. సీఎంఆర్ చేసి ధాన్యమంతా గతంలో పక్కదారి పట్టిందని, ఈసారి మాత్రం వీలైనంత త్వరగా ప్రభుత్వానికి అప్పగించాలని కోరారు.

అనంతరం మిల్ల ర్ల సంఘం నాయకులు రవాణా, సీఎంఆర్‌కు ధరలు పెంచాలని, గత ధరలతో తమకు గిట్టుబాటు కావడంలేదని, హామాలీ చార్జీలు, కరెంటు బిల్లులు పెరిగాయని దీంతో తమకు నష్టాలు వస్తున్నాయని పేర్కొన్నారు. స్పందించిన కమిషనర్ ప్రభుత్వానికి ఈ విషయంపై వివరించానని, త్వరలో శుభవార్త వింటారని హామీ ఇచ్చినట్టు తెలిసింది.