calender_icon.png 28 April, 2025 | 9:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అధికారులకు మిల్లర్ల దావత్

28-04-2025 01:11:48 AM

సీఎంఆర్ దాన్యం కోసం శతవిధాల ప్రయత్నాలు 

విందులిస్తూ.. డబ్బులు ఎరవేస్తూ

మంచిర్యాల, ఏప్రిల్ 27 (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లాలో మిల్లర్లు అధికారులను ప్రసన్నం చేసుకునేందుకు ఒకవైపు విందులు ఇస్తూ.. మరోవైపు డబ్బుల ఎరవేస్తూ నానా ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. గత సీజన్లలో ప్రభుత్వం మిల్ల ర్లకు కేటాయించిన ధాన్యాన్ని అమ్ముకొని కోట్లకు కోట్లు విలువ చేసే ధాన్యాన్ని మిం గిన బకాసురులు ఈ ఏడాది రబీ సీజన్‌లో ధాన్యాన్ని తమ మిల్లులకు కేటాయించాలని పలు రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. 

విందులిస్తూ.. డబ్బులు ఎరవేస్తూ...

రబీ సీజన్‌కు సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన దాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి సేకరించిన ధాన్యాన్ని డీఫాల్ట్, గతం లో ప్రభుత్వానికి సీఎంఆర్ ఇవ్వని మిల్లులకు కేటాయించవద్దని నిర్ణయం తీసుకున్నారు. జెసి సభవ మోతిలాల్ సీఎంఆర్ ఇవ్వని మిల్లులపై ఆర్‌ఆర్‌యాక్ట్, క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సివిల్ సప్లై అధికారుల కు ఆదేశాలు జారీ చేయడమే కాకుండా జిల్లాలోని బకాయిపడ్డ మిత్రులపై కేసులు నమోదు చేయించారు. మరికొన్ని మిల్లులపై ఆర్‌ఆర్ యాక్టు అమలు చేయించారు.

ఇలా ప్రాబ్లమెటిక్ ఉన్న మిల్లులకు ఈ ఏడాది ధాన్యం కేటాయించకపోవడంతో రైస్ మిల్ల ర్స్ అసోసియేషన్ నాయకులు అధికారుల కు విందులు ఇస్తూ, లక్షల్లో ఆశ చూపుతూ ట్యాగింగ్ ఇవ్వాలంటూ ప్రదక్షిణలు చేస్తున్నా రు. అధికారులకు మిల్లర్లు విందు ఇస్తున్నారని విషయం ఆదివారం జిల్లా అంతా వ్యాపించింది. ఈ విందుకు ఎంతమంది మిల్లర్లు వచ్చారు.. అధికారులు ఎవరెవరు వచ్చారు అని ఇంటలిజెన్స్ అధికారులు సైతం మీడియాకు ఫోన్ చేశారంటే ఈ వార్త ఏ మేరకు పాకిందో అర్థం చేసుకోవచ్చు.

నాకు ఎలా రాదో చూస్తానంటూ..

ప్రభుత్వానికి సీఎంఆర్ బకాయిపడ్డ మిల్ల ర్లు హైదరాబాద్ కమిషన్‌రేట్‌కు, మరోవైపు జిల్లా కేంద్రంలోని కలెక్టర్ రేటుకు ప్రతిరోజు చెక్కర్లు కొడుతున్నారు. ట్యాగింగ్ రాని కొం దరు మిల్లర్లు అయితే ఏకంగా కలెక్టరే మా మనిషి, నాకు ఎలా రాదో చూస్తానంటూ ఛాలెంజ్‌గా తీసుకొని ట్యాగింగ్ తెచ్చుకునే ప్రయత్నం చేస్తుండడంతో అసలు జిల్లాలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి.

మరోవైపు లంచాలకు అలవాటు పడిన అధికారులు ఇలా డిఫాల్ట్ లో ఉన్న మిల్లులకు, గతంలో ప్రభుత్వానికి ఇవ్వాల్సిన సీఎంఆర్ ఇవ్వని మిల్లులకు మరో దఫా ధాన్యం కేటాయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు మిల్లర్లు ఆదివారం దావత్ అనంతరం రేపో మాపో మాకు అనుమతి వస్తుందని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు ఫోన్ ద్వారా సమాచారం ఇస్తున్నారు అంటే వారికి అధికారులపై ఉన్న నమ్మకం ఎంతో అర్థం చేసుకోవచ్చు.