calender_icon.png 2 April, 2025 | 12:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బెడిసి కొట్టిన షకీల్ బియ్యం ఎగవేత కేసు

01-04-2025 12:06:41 AM

రూ.120 కోట్ల విలువైన బియ్యం గయాబ్ 

న్యాయం కోసం హైకోర్టు తలుపు తట్టిన మిల్లర్ కిషోర్

సహకరించిన అధికారులపై కేసుకు హైకోర్టు ఆదేశం 

నిజామాబాద్ మార్చ్ 31: (విజయ క్రాంతి): బీఆర్‌ఎస్ పార్టీ బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల అహ్మద్ బియ్యం ఎగవేత కేసు బెడిసి కొట్టింది. ప్రభుత్వానికి అప్పగించాల్సిన కష్టం స్మెల్లింగ్ రైస్ ను మాయం చేసి షకీల్ తన మిల్లులోని బియ్యం బకాయి లేమీ లేవని కప్పిపుచ్చడానికి చేసిన అక్రమ బియ్యం బదిలీ వ్యవహారం బెడిసి కొట్టింది. షకీల్ తన రైస్ మిల్లు నుండి తన మిల్లుల కు ధాన్యం తరలించినట్టు అధికారులు తప్పుడు పత్రాలు సృష్టించారని తన సంతకాలు ఫోర్జరీ చేశారని నిజామాబాద్ జిల్లా వర్ని చెందిన రైస్ మిల్లర్ బోయపాటి కిషోర్ హైకోర్టును ఆశ్రయించారు న్యాయపోరాటం జరపడంతో బండారం బయటపడింది.

కేసును విచారించిన హైకోర్టు

ఆదేశాల మేరకు గతంలో జిల్లా అదనపు కలెక్టర్ గా పని చేసిన చంద్రశేఖర్ సి ఓ గా పనిచేసిన చంద్రప్రకాష్ డిప్యూటీ తాసిల్దార్ నిఖిల్ రాజు పై వర్ని పోలీసులు 465. 468. 506. 34. సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు  బిఆర్‌ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ అధికార పార్టీ ఎమ్మెల్యే షకీల్ కు క్లీన్ చీటీ ఇచ్చేందుకు అక్రమ బదిలీ దొంగ పత్రాలు సృష్టించి నిన్న అధికారుల పై  కేసులు నమోదయ్యాయి.