calender_icon.png 30 October, 2024 | 2:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వివాదంలో మిల్కీ బ్యూటీ

30-06-2024 12:05:00 AM

మిల్కీ బ్యూటీ తమన్నా మరోమారు వివాదంలో చిక్కుకుంది. మితిమీరిన అందాల ప్రదర్శనతో ఇటీవల వార్తల్లో నిలుస్తున్న ఈ అమ్మడు ఈసారి తన ప్రమేయం లేకుండానే తీవ్ర విమర్శల పాలవుతోంది. సింధీ సామాజిక వర్గానికి చెందిన తమన్నా భాటియాతోపాటు నటుడు రణ్‌వీర్ సింగ్ గురించి విద్యార్థుల పుస్తకాల్లో పాఠ్యాంశంగా ముద్రించి ఉండటమే ఇందుకు కారణం. కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు సమీపంలో ఉన్న హెబ్బల్ ప్రాంతంలో సింధీ హైస్కూల్‌లో 7వ తరగతి విద్యార్థులకు తమన్నా జీవిత విశేషాలతో కూడిన ఓ ప్రత్యేక పాఠాన్ని పొందుపర్చారు. ఇది గ్రహించిన విద్యార్థుల తల్లిదండ్రులు ఈ పాఠ్యాంశంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ స్థానిక బాలల హక్కుల రక్షణ సంఘానికి ఫిర్యాదు చేశారు.

సినమాల్లో అర్ధనగ్నంగా కనిపించే నటీనటులు పిల్లలకు ఎలా ఆదర్శవంతులవుతారని మండిపడ్డారు. స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత సింధూ ప్రాంతం విభజన అనంతరం ఆ సామాజిక వర్గ ప్రజల జీవితాలు ఎలా మారాయనే విషయాన్ని విద్యార్థులకు తెలియజేసేందుకే తమన్నా జీవిత విశేషాలను పాఠ్యాంశంగా చేర్చినట్టు స్కూల్ యాజమాన్యం వివరణ ఇచ్చింది. ఇక తమన్నా సినిమాల విషయానికొస్తే.. ఈ చిన్నది ప్రస్తుతం తెలుగులో ‘ఓదెలు ద్వారా యాక్షన్ హీరోయిన్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు కరసత్తులు చేస్తోంది. బాలీవుడ్‌లో నిఖిల్ అద్వానీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వేదా’లో తమన్నానే హీరోయిన్. అటు తమిళంలో రమేశ్ దర్శక త్వంలోని ‘కాతు కరుప్పు’ చిత్రంలో, దర్శకుడు ఎ.కరుణాకరణ్ తెరకెక్కిస్తున్న మరో మూవీలోనూ నటిస్తోంది.