21-04-2025 05:15:35 PM
మహబూబాబాద్(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పట్టణ ముస్లిం ప్రజల అభ్యున్నతి, ప్రయోజనాల కోసం మండల షాదిఖానా నిర్మాణం కోసం రూ.80 లక్షల నిధులు మంజూరు చేయించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సలహాదారుడు వేం నరేందర్ రెడ్డికి కేసముద్రం మండల ముస్లిం కుల సంఘం, షాదిఖాన నిర్మాణ కమిటీల ఆధ్వర్యంలో సోమవారం వేం నరేందర్ రెడ్డి స్వగ్రామం అర్పనపల్లిలో సన్మానించారు. అనంతరం వేం నరేందర్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా కేసముద్రం మండల షాదిఖాన నిర్మాణ కమిటీ అధ్యక్షులు మహమ్మద్ అలీ, కేసముద్రం మండల ముస్లిం కుల సంఘం అధ్యక్షులు షేక్ ఖాదర్ మాట్లాడుతూ ముస్లిం ప్రజల కోసం షాదిఖానా నిర్మాణానికి 80 లక్షల రూపాయలు మంజూరు చేయించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో షాదిఖానా నిర్మాణ కమిటీ ప్రధాన కార్యదర్శి షేక్ జావిద్, కోశాధికారి షేక్ అక్బర్, కార్యదర్శి మహ్మద్ అల్లావుద్దీన్, కేసముద్రం మండల ముస్లిం కుల సంఘం ప్రధాన కార్యదర్శి షేక్ నయీం, గౌరవ సలహాదారులు మహ్మద్ హఫీజ్, పెనుగొండ గ్రామ సదర్ షేక్ జావిద్, ఉప్పరపల్లి గ్రామ సదర్ మహమ్మద్ అమీరుద్దీన్, కేసముద్రం విలేజ్ గ్రామ సదర్ షేక్ అమీర్, అర్పనపల్లి గ్రామ సదర్ షేక్ ఖాదర్, రంగాపురం గ్రామ సదర్ మహ్మద్ అంకూస్, కల్వల గ్రామ సదర్ మహ్మద్ పాషా, ఇంటికన్నె గ్రామ సదర్ మహ్మద్ తాజుద్దీన్, ప్రధాన కార్యదర్శి షేక్ నయీం, ఉపాధ్యక్షులు మహమ్మద్ యాకూబ్ పాషా, సహాయ కార్యదర్శులు షేక్ బాషుమియ, మహమ్మద్ గఫార్, మహమ్మద్ జావిద్, మహమ్మద్ రఫీ, సయ్యద్ ఖాదర్ బాబా పాల్గొన్నారు.