calender_icon.png 19 March, 2025 | 8:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం చిత్ర పటానికి క్షీరాభిషేకం

19-03-2025 01:13:44 AM

కూసుమంచి , మార్చి 18 :-తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు విద్య ,ఉద్యోగాలు , స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 42 శాతానికి పెంచుతూ తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లులకు ఏకగ్రీవంగా ఆమో దం తెలపడంతో హర్షం వ్యక్తం చేస్తూ మంగళవారం కూసుమంచి మండల కేంద్రంలో బీసీ సంఘాల నాయకులు, కార్యకర్తలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ,మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిల చిత్ర పటానికి పాలా భిషేకం చేసి ఆనందం వ్యక్తం చేశారు..

ఈ సందర్భంగా సీనియర్ కాంగ్రెస్ , బీసీ సంఘ నాయకుడు చెన్న మోహన్ మాట్లాడారు.ఈ కార్యక్రమంలో సిడిసి చైర్మన్ ఎర్రబోలు సూర్యనారాయణ రెడ్డి  ,ఏఎంసీ మార్కెట్ డైరెక్టర్లు కంచర్ల సుధీర్ రెడ్డి , బొంగ నాయక్ , మాజీ సర్పంచులు చెన్నా మోహన్ రావు , భారీ వీరభద్రం, మాజీ ఎంపీటీసీ మాదాసు ఉపేందర్ రావు ,  నాయకులు పాల్గొన్నారు.