calender_icon.png 11 March, 2025 | 6:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జుక్కల్ ఎమ్మెల్యే చిత్రపటానికి క్షీరాభిషేకం

11-03-2025 12:48:23 AM

మద్నూర్, మార్చి 10 : కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం లోని మద్నూర్ మండలానికి 200 కోట్లతో సామూహిక గురుకుల పాఠశాల భవన నిర్మాణానికి ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయించినందుకు  మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం  ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించినట్లు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సరాఫ్ సాయిలు తెలిపారు. ఈ కార్యక్రమంలో  మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పరమేష్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు హనుమంతు యాదవ్, స్వామి, హను మండ్లు, హనుమంతరావు దేశాయి, కొండ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.