జగదేవపూర్, జనవరి 30 : జగదేవపూర్ మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ స్థానిక నాయకులు మచ్చ బాబు,దినేష్ ఆధ్వర్యంలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మంద కృష్ణ మాదిగకు పద్మశ్రీ అవార్డు వచ్చిన సందర్భంగా మంద కృష్ణ మాదిగ చిత్ర పటానికి పాలాభి షేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ దేశంలో అత్యున్నత పురస్కారం పద్మ శ్రీ మంద కృష్ణ మాదిగ కి రావటం దళిత బహుజనులకు గర్వకారణం అని అన్నారు.
దేశ నలుమూలల పెదల తరపున నిరంతరం పోరాటం చేసిన ఘనత మంద కృష్ణ మాదిగ ఒక్కరకే దక్కుతుంది అని తెలిపారు. గతంలో పెదలు, బడుగు బలహీన వర్గాల ఆరోగ్యం కోసం, వృద్ధులు, వికలాంగుల పింఛన్లు కోసం ప్రభుత్వల పై ఒత్తిడి తెచ్చి వాటిని పేద ప్రజలకు అకింతం చేసిన నాయకుడు అని గుర్తు చేశారు.
మంద కృష్ణమాదిగ ఎస్సీ కులంలో ఉన్న అన్ని ఉపకులలకు సమాన అవకాశాలు రావాలి అంటే అది కేవలం వర్గీకరణతోనే సాధ్యం అవుతుంది అని కఠోర దీక్షతో కుటుంబానికి దూరం అయ్యి నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ నేడు వర్గీకరణ చివరి దశకు తెచ్చారు అని గుర్తు చేశారు.
మంద కృష్ణమాదిగ అంటే నవ యుగా అంబేద్కర్ వారసుడు అని దళిత జాతి ముద్దు బిడ్డ అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు మచ్చ మహేష్,తుర్కపల్లి నాగరాజ్, మచ్చ అశోక్, గడ్డం ఉపేందర్, నర్మేట రాజు, కోరమైన యాదగిరి, గడ్డం రాజు,మచ్చ హరిప్రసాద్, గడ్డం భాను, శ్రీధర్ అరవింద్, కోరమైన మహేష్, చక్రి, ప్రణయ్, రవి, వంశీ పాల్గొన్నారు.