20-03-2025 01:03:13 AM
హనుమకొండ, మార్చి 19 (విజయ క్రాంతి): ఎస్సీల వర్గీకరణ విజయం మాదిగ అమరవీరులది. మాదిగ జాతి కోసం తన జీవితాన్ని త్యాగం చేసి పోరాటాన్ని ముం దుకు నడిపిన మాదిగ జాతి నాయకుడు మంద కృష్ణ మాదిగదని ఎంఎస్పీ జాతీయ నేతలు మందకుమార్ మాదిగ , వేల్పుల సూరన్న కాపు అన్నారు.
నిన్న ఎస్సీల వర్గీకరణ బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందిన సందర్భంగా ఈరోజు అంబేద్కర్ కూడలిలో ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు గద్దల సుకుమార్ అధ్యక్షతన జరిగిన విజయోత్సవాల్లో ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎంఎస్పీ జాతీయ నేతలు మంద కుమార్ మాదిగ, వేల్పుల సూరన్న కాపు లు మాట్లాడుతూ 1994 లో ఎస్సీల వర్గీకరణ కోసం రిజర్వేషన్లలో జనాభా దామాషా ప్రకారం మాదిగలకు రావాల్సిన రిజర్వేషన్ వాటా కోసం మంద కృష్ణ మాదిగ నాయకత్వంలో ఏర్పాటైన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో మాదిగలు చేస్తున్న పోరాటంలో పొన్నాల సురేందర్ మాదిగ నుండి మొదలుకుంటే భారతి మాదిగ వరకు ఎంతోమంది మాదిగ బిడ్డలు వర్గీకరణ కావాలని ఆత్మ బలిదానాలు చేసుకు న్నారని అలాంటి మాదిగ అమరవీరులకు ఈరోజు వర్గీకరణ అయినందుకు వారికి ఘనమైన నివాళులు అర్పించినంతరం.
మం ద కృష్ణ మాదిగ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి మాట్లాడుతూ ఈ వర్గీకరణ విజయం మంద కృష్ణ మాదిగ నాయకత్వంలో మాదిగలు సాధించుకున్న విజయమని. ఎస్సీల వర్గీకరణ కోసం మాదిగ జాతి 30 సంవత్సరాల పైగా అలుపెరుగకుండా పోరాటం చేసిందని , ప్రాణ త్యాగం చేశారని లాఠీ దెబ్బలు తిన్నారని ఎంతోమంది మీద కేసు లు అయితే జైల్లపాలు అయ్యారని ఎమ్మార్పీఎస్ మీద మందకృష్ణ మాదిగ మీద పాలకులు ఎంత కుట్రలు చేసినా కూడా అన్నిటిని తట్టుకొని ఈరోజు విజయం సా ధించామని.
ఈ విజయానికి సహాయ సహకారాలు అందించిన ప్రధానమంత్రి మోడీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లు, మొదలుకుంటే ఎమ్మార్పీఎస్ కు మద్దతుగా నిలిచిన యావత్తు సమాజానికి మరియు ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో జరిగిన సభలకు సమావే శాలకు వచ్చిన ప్రతి మాదిగ బిడ్డకు, సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా మాదిగ జాతి పక్షాన మంద కృష్ణ మాదిగ పక్షాన చేతులెత్తి నమస్కరిస్తున్నామని కృతజ్ఞతలు చెప్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మంద కృష్ణ మాదిగ గారి పెద్దన్న మంద ఇద్దయ్య మాదిగ ,మాజీ ఎంఆర్పిఎస్ జాతీయ పోలిట్ బ్యూరో సభ్యులు బొడ్డు దయాకర్ మాదిగ ,ఎమ్మెస్ పి రాష్ట్ర నాయకులు పుట్ట రవి మాదిగ ,ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జన్ను దినేష్ మాదిగ ,జిల్లా ఇన్చార్జి మంద రాజు మాదిగ ,ఎం ఎస్ పి జిల్లా అధ్యక్షులు బండారి సురేందర్ మాదిగ ,మాదిగ ఎంప్లాయిస్ ఫెడరేషన్ జాతీయ నాయకులు కుమ్మరి రాజయ్య మాదిగ , మంద చిన్న రాజు మాదిగ , కొత్తూరి ప్రభాకర్ మాదిగ , మాదిగ యువసేన జాతీయ నాయకులు చాతల్లా శివ మాదిగ , ఎమ్మార్పీఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ మంద వర్ధన్ మాదిగ మరియు ఎమ్మార్పీఎస్ ఎంఎస్పీ నాయకులు బొక్కల నారాయణ మాదిగ , అక్కెనకుంట వెంకటస్వామి మాదిగ , తిప్పారపు మల్లేష్ మాదిగ , మంద స్వరాజ్ మాదిగ , బొక్క రాజేష్ మాదిగ సిలువేరు బిక్షపతి మాదిగ , మాజీ కార్పొరేటర్లు ప్రకాష్ మాదిగ , మేకల బాబు మాదిగ ,రేణుకుంట్ల రాజేంద్ర మాదిగ ,ఎర్ర రామ్ మాదిగతదితరులు పాల్గొన్నారు.