calender_icon.png 18 April, 2025 | 3:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రధాని మోదీ చిత్రపటానికి క్షీరాభిషేకం..

05-04-2025 04:28:47 PM

బెల్లంపల్లి అర్బన్: వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు ఆమోదం నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి బిజెపి నాయకులు క్షీరాభిషేకం చేశారు. పట్టణంలోని కాంటా అంబేద్కర్ చౌరస్తాలో శనివారం నరేంద్ర మోడీ చిత్రపటానికి మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి, బిజెపి రాష్ట్ర నేత కొయ్యల ఏమాజీ పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు. బిజేపీ ప్రభుత్వం పేద ముస్లింల మేలుకొరకు తీసుకొచ్చిన వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు ముస్లింలు, దేశ ప్రజలు  మద్దతివ్వాలని కోరారు. వక్ఫ్ బోర్డు బిల్లు ఉభయ సభల్లో ఆమోదం పొందడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షురాలు దార కల్యాణి, జిల్లా ఉపాధ్యక్షులు పులగం తిరుపతి, అసంబ్లీ కన్వీనర్ రాచర్ల సంతోష్, జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు కోడి రమేష్, జిల్లా కౌన్సిల్ సభ్యులు శనిగారపు శ్రావణ్, సీనియర్ నాయకులు బోల్లెడ్ల కేశవరెడ్డి, ఉప్పుల మోహన్, యువ నాయకుడు కునిరాజుల అరవింద్ మహిళా మొర్చా జిల్లా ప్రథాన కార్యదర్శి గోమాస కమల, బీసీ మోర్చ జిల్లా నాయకులు ఆకుల శంకర్ పట్టణ కార్యదర్శి సల్లం సుమలత, ఎర్రోజు శ్రీనివాస్, పుల్లరి రాము, పాల్గొన్నారు.