20-03-2025 05:14:21 PM
మందమర్రి (విజయక్రాంతి): ఎస్సీ వర్గీకరణ, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ బిల్లులను ఆమోదం, రాజీవ్ యువ వికాస్ వంటి కార్యక్రమాలు అమలు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ యువజన కాంగ్రెస్ ఆద్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజ నరసింహ, పొన్నం ప్రభాకర్, మంచిర్యాల జిల్లా అధ్యక్షురాలు డీసీసీ అధ్యక్షురాలు సురేఖ, యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు జక్కిడి శివ చరణ్ రెడ్డిల చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు.
గురువారం పట్టణంలోని పాత బస్టాండ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చెన్నూరు నియోజకవర్గం యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ఎండి నయుం మాట్లాడుతూ.. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం కుల గణన చేపట్టినన్నారు. కుల గణన ద్వారా బీసీలకు సమానమైన వాటా దక్కిందని అది కాంగ్రెస్ ప్రభుత్వం తోనే సాధ్యమైందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు శనిగారపు సాగర్, జిల్లా జనరల్ సెక్రటరీ నోముల రాజేందర్ గౌడ్, నాయకులు వడ్డూరి సునీల్ కుమార్, సల్లూరి సుధాకర్, దుర్గం అశోక్ లు పాల్గొన్నారు.