21-03-2025 01:36:08 AM
మంచిర్యాల, మార్చి 20 (విజయక్రాంతి) : మంచిర్యాల ఐబీ చౌరస్తాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంచిర్యాల శాసనసభ్యుడు కోక్కిరాల ప్రేమ్ సాగర్ రావు చిత్రపటాలకు గురు వారం కాంగ్రెస్ పార్టీ నాయకులు పాలాభిషేకం చేశారు.
ఎస్సీ వర్గీకరణ బిల్లు, బీసీ రిజర్వేషన్ బిల్లు 42 శాతం అసెంబ్లీలో ఆమోదించిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం మిఠాయిలు పంపిణీ చేసి, టపాకాయలు పేల్చి సంబరాలు జరిపారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, మహిళా నాయకురాళ్లు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.