19-03-2025 01:05:01 AM
రాజేంద్రనగర్, (కార్వాన్) మార్చి 18 (విజయక్రాంతి): ప్రభుత్వం అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు బట్ట విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చిత్రపటాలకు కార్వాన్ నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు మంగళవారం క్షీరాభిషేకం చేశారు.
నియోజకవర్గ పరిధిలోని గుడిమల్కాపూర్ డివిజన్లోని లక్ష్మీ నగర్ నిర్వహించిన కార్యక్రమంలో qవారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ బీసీల అభ్యున్నతికి అన్ని విధాలుగా చర్యలు తీసు కుంటుంది అన్నారు. అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ పార్టీ వెంటే ఉన్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం అధ్యక్షుడు కూరాకుల కృష్ణ, టీపీసీసీ జాయింట్ సెక్రటరీ నర్సింగ్ గౌడ్, గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ సెక్రటరీ అబ్దుల్ హమీద్ తదితరులు పాల్గొన్నారు.