21-03-2025 01:30:53 AM
చొప్పదండి, మార్చి 20 (విజయ క్రాంతి): గంగాధర మండలం మధురానగర్ చౌరస్తాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చిత్రపటాలకు కాంగ్రెస్ నాయకులు చేరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పార్టీ మండలాధ్యక్షుడు కురుమల మనోహర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో నాయకులు దుబ్బాసి బుచ్చయ్య,జాగిరపు శ్రీనివాస్ రెడ్డి,రామిడి రాజిరెడ్డి,దోర్నాల శ్రీనివాసరెడ్డి, వేముల భాస్కర్, ఎస్సి సెల్ అధ్యక్షులు కొలెపాక స్వామి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు దూలం వీరేశం, దీకొండ మధు, గరిగంటి కరుణాకర్, ముచ్చె శంకర్, తాళ్ల శ్రీనివాస్, పడాల రాజయ్య, గంగాధర సుదర్శన్, నాగేందర్ రెడ్డి, ఆముదాల రోహిత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.