calender_icon.png 23 April, 2025 | 3:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్యే చిత్రపటానికి క్షీరాభిషేకం

23-04-2025 12:10:53 AM

మద్నూర్, ఏప్రిల్ 22, (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని జొన్న రైతులకు ఊరట లభించింది. ఇప్పటివరకు ఎకరాకు 8 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తున్న జొన్నల పరిమితిని, ఎకరాకు 14 క్వింటాళ్లుగా పెంచే దిశగా వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వర రావు తో చర్చించి, ప్రభావవంతంగా కృషి చేసిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతా రావు కు రైతుల తరఫున అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ సందర్భంలో మద్నూర్ మండల లోని కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో మార్కెట్ కమిటీ కార్యాలయంలో మంగళవారం సీఎం  రేవంత్‌రెడ్డి  వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతా రావు  ఫోటోలకు పాలభిషేకం నిర్వహించి కృతజ్ఞతలు తెలిపారు. రైతుల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయంగా పనిచేస్తున్న కాంగ్రెస్ పాలనపై గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఈ కార్య క్రమంలో సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ పటేల్  ఏఎంసీ వైస్ చైర్మన్  పరమేష్ పటేల్ హను మాన్ మందిర్ ఆలయ చైర్మన్ రామ్ పటేల్ హన్మంత్ యాదవ్ అయిల వార్ రమేష్ వట్నాల వార్ రమేష్ సంతోష్ పటేల్ మాజీ ఎంపీపీ ప్రజ్ఞ కుమార్ హనుమాన్ స్వామి  కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.