calender_icon.png 1 April, 2025 | 3:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం

26-03-2025 12:26:13 AM

అచ్చంపేట  మర్చి 25: బీసీ కులాలకు42% రిజర్వేషన్ కల్పించడంపై అచ్చం పేట నియోజకవర్గం అమరాబాద్ మండ లం మన్ననూర్ గ్రామంలో మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ నేతలు పాలాభిషేకం చేశారు.

ఉద్యమ ముసుగులో అధికారాన్ని చేపట్టిన టిఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల గొప్పగా మార్చి తన కుటుంబం మాత్రం ఆర్థికంగా ఎదిగిందని మండిపడ్డారు. అప్పు ల రాష్ట్రంగా ఉన్న తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ఇప్పుడిప్పుడే అన్ని రంగాల్లో అభివృద్ధికి బాటలు వేస్తోందని ఈ ప్రాంత వాసిగా ముఖ్యమంత్రి ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానం మేరకు బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించడం గర్వించదగ్గ విషయం అన్నారు. పాలా భిషేకం నిర్వహించిన వారిలో కాంగ్రెస్ నేతలు వెంకటరమణ, సత్యనారాయణ, మా జీ వైస్ ఎంపీపీ వెంకటేశ్వర్లు, మాజీ ఎంపీటీసీ శ్రీను, బిసి నాయకులు కృష్ణయ్య తదితరులున్నారు.