calender_icon.png 7 February, 2025 | 4:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం

07-02-2025 02:07:12 AM

  • బీసీ కులగణన విజయవంతమైనందుకు  కృతజ్ఞతలు 
  • ముఖ్యమంత్రి, మంత్రుల చిత్రపటానికి కాంగ్రెస్ శ్రేణుల క్షీరాభిషేకం

జగిత్యాల, ఫిబ్రవరి 6 (విజయక్రాంతి): జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గ కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మం త్రులు, ముఖ్య నేతల చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గురువారం పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కోరుట్ల ప్రాంత కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఆనాడు భారత్ జోడో యాత్ర సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ   కులగనన చేస్తామని హామీఇచ్చారు.

రాష్ర్టంలో అధికా రంలోకి కాంగ్రెస్ పార్టీ రాగానే, సర్వే చేసి విజయవంతగా కులగణన పూర్తిచేసింద న్నారు. ఈ కులగణనను ఆమోదించిన రాష్ట్రా ప్రభుత్వానికి, హామీ నెరవేర్చిన తెలం గాణ ముఖ్యమంత్రి రేవంత్’రెడ్డి, బీసీ సంక్షే మ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్’గౌడ్, ఇతర మంత్రులకు, రాష్ర్ట ఓబీసీ సెల్ చైర్మన్ నూతి శ్రీకాంత్’లకు కృతజ్ఞతలు చెప్పి,

వారి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. తెలం గాణ రాష్ర్టంలో బీసీ కులగణన ద్వారా ఓబీసీలు అందరికీ రిజర్వేషన్లు పెరిగి సామా జిక, విద్య, ఉపాధి, రాజకీయ అవసరాలు  మెరుగుపడతాయన్నారు. ఇది దేశంలో చారి త్రాత్మకమైన నిర్ణయం అన్నారు.  దేశం మొ త్తం తెలంగాణ రాష్ర్టం వైపు  చూస్తున్నదని కాంగ్రెస్ నాయకులన్నారు.

కాంగ్రెస్ పార్టీ ఆశాజ్యోతి అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్’రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, సబ్ కమిటీ చెర్మన్ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, ప్రచార కమిటీ  చైర్మన్ మధు యాష్కి, ఎమ్మెల్సీ  టీ జీవన్ రెడ్డి, ప్రభుత్వ  విప్ లక్ష్మణ్ కుమార్, కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి  జువ్వడి నర్సింగ్ రావు, సీనియర్ కాంగ్రెస్ నాయకు లు కృష్ణారావు లకు నియోజకవర్గ బీసీల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్ర మంలో బీసీ సెల్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్య క్షుడు గడ్డం వెంకటేష్’గౌడ్, కోరుట్ల  పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు తిరుమల గంగాధర్, కోరుట్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొంతం రాజం, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పెరుమాండ్ల సత్యనారాయణ, కోరుట్ల మం డల బీసీ  సెల్ అధ్యక్షుడు ముక్కెర లింబాద్రి, మల్లాపూర్ మండల బీసీ సెల్ అధ్యక్షుడు సురేష్, జిల్లా కిషన్ కాంగ్రెస్ ప్రధాన  కార్యదర్శి పోతుగంటి శంకర్ గౌడ్, నాయ కులు పుప్పాల  ప్రభాకర్, ఎంభేరి నాగభూ షణం, సింగల్ విండో చైర్మన్ ఏలిశెట్టి భూమారెడ్డి, మోర్తాద్ లక్ష్మి నారాయణ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వెంకటేష్, తదితర నాయకులు పాల్గొన్నారు.