calender_icon.png 4 February, 2025 | 6:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం

30-01-2025 12:00:00 AM

జహీరాబాద్ జనవరి 29 : ఝరాసంఘం మండలం బర్దిపూర్ గ్రామంలో వివిధ పథకాలను అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసి, వారి ఖాతాల్లో నగదును జమ చేయడంతో ఆ గ్రామ ప్రజలు సంబరాలు జరుపుకున్నారు. బుధవారం గ్రామ సీనియర్ కాంగ్రెస్ పార్టీ  ఆధ్వర్యంలో ప్రజలు సీఎం చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఆత్మీయ భరోసా కింద 77 మంది లబ్ధిదారులకు ఖాతాలో నగదు బదిలీచేయడంతో ఆనందం వ్యక్తం చేశారు.   

ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని సీఎం రేవంత్ రెడ్డి నిలబెట్టుకున్నారని వివరించారు. 50,092 మంది రైతుల ఖాతాలో నగదు బదిలీ చేశారు. అరులైన వారికి రేషన్ కార్డులు  అందజేశారు.  గ్రామాన్ని ఎంపిక చేయడం పట్ల  మంత్రి దామోదర్ రాజనర్సింహ, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు నిర్మలా రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు హనుమంతరావు పాటిల్ లకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.