20-03-2025 01:13:39 AM
రాజాపూర్ మార్చి 19 : బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడం తోపాటు ఎస్సీలకు 15 శాతం రిజర్వేషన్లు కల్పించినందుకు హర్షం వ్యక్తం చేస్తూ బుధవారం రాజాపూర్ మండల కేంద్రంలోని ముఖ్య కూడలిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం బాణా సంచాకాల్చి సంబరాలు చేసుకున్నారు.
అసెంబ్లీలో బిల్లులను ఆమోదించడం పట్ల సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రి వర్గానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఎన్నో ఏళ్ళు నుండి మాదిగ రిజర్వేషన్ బిల్లుకు పోరాడుతున్న మాదిగలకు అసెంబ్లీ లో రిజర్వేషన్ బిల్లుకు మద్దతు తెలిపి ఆమోదించడం గొప్ప విషయం అని కొనియాడారు. అలాగే బీసీలకు 40 శాతం రిజర్వేషన్లు కల్పించారని ఆనందం వ్యక్తం చేశారు. ఈకార్యక్రమంలో వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.