22-03-2025 12:00:00 AM
మహబూబాబాద్. మార్చి 21 : (విజయ క్రాంతి) : మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలో మానుకోట ఎమ్మెల్యే మురళి నాయక్ ఆదేశాల మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చిత్రపటానికి కాంగ్రెస్ మండల పార్టీ నాయకులు పాలాభిషేకం నిర్వహించారు. అసెంబ్లీలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ చట్టబద్రత కల్పించినందుకు దానికి కృషి చేసినందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసినట్లు మండల పార్టీ అధ్యక్షుడు వెంకన్న తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వాంకుడొత్ కొమ్మలు,జిల్లా నాయకులు బుడిగే సతీష్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బొల్లికొండ మధు, జిల్లా సహాయ కార్యదర్శి అర్రే మ్ వీరస్వామి,పట్టణ అధ్యక్షులు రాసమల్ల యాకయ్య, మండల నాయకులు పూజారి శంకర్, రసూల్, చీకటి శ్రీనివాస్, మంగిలాల్, బాలు నాయక్, ఎలమందల శ్రీను, సుర గంగయ్య, శ్రీను, జిల్లా యూత్ ఉపాధ్యక్షుడు అజ్మీర మాలు నాయక్, పట్టణ యూత్ అధ్యక్షులు వల్లపు నాగరాజు, వివిధ గ్రామాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల నాయకులు యూత్ నాయకులు పాల్గొన్నారు.