calender_icon.png 19 March, 2025 | 6:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం

19-03-2025 02:32:27 PM

నారాయణఖేడ్: నారాయణఖేడ్ పట్టణంలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) చిత్ర పాటలకు బుధవారం క్షీరాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ డిసిసి ప్రధాన కార్యదర్శి పి. చంద్రశేఖర్ రెడ్డి,పి. సుధాకర్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించడంతోపాటు బడ్జెట్లో యువతకు పెద్దపీట వేయడం యువకుల కోసం యువవికాసం వంటి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం అభినందనీయం అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోని మహిళలకు, పేదలకు,యువకులకు న్యాయం జరుగుతుందన్నారు.పేదలకు సంక్షేమ పథకాలు అందడం జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలోసిడీసి చైర్మన్ షాదుల్, పిఎసిఎసిచైర్మన్ అశోక్ రెడ్డి,మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ దారం శంకర్ సెట్, రమేష్ చౌహన్, నాయకులు సాయిలు పటేల్ , ముదిరాజ్ శంకర్, శ్రీకాంత్ రెడ్డి, పండరీ రెడ్డి, స్థానిక మైనార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.