01-04-2025 07:31:44 PM
చిట్యాల (విజయక్రాంతి): పేదల కోసం ప్రవేశపెట్టిన సన్న బియ్యం పంపిణీ పథకాన్ని హర్షిస్తూ మంగళవారం మండలంలోని తిరుమలాపూర్, గోపాలపురం, నైన్ పాక గ్రామంలో పార్టీ శ్రేణులు వేరు వేరుగా సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు గూట్ల తిరుపతి, జిల్లా అధికార ప్రతినిధి దొడ్డి కిష్టయ్య, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మూల శంకర్ గౌడ్ మాట్లాడుతూ... ఇన్ని రోజులు పంపిణీ చేసిన దొడ్డు బియ్యాన్ని ప్రజలు తినలేదని చెప్పారు.
దీన్ని గ్రహించిన సీఎం రేవంత్ రెడ్డి సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తూ నిరుపేదల పొట్ట నింపుతున్నారన్నారు.ఈ కార్యక్రమంలో గోపాలపురం గ్రామ కమిటీ అధ్యక్షుడు నీలం కుమారస్వామి, నైన్ పాక గ్రామ శాఖ అధ్యక్షుడు తొట్ల రాజయ్య, తిరుమలాపూర్ గ్రామ శాఖ అధ్యక్షుడు గజ్జి రవి, సీనియర్ జర్నలిస్ట్ రామచంద్రమూర్తి, తానేష్, కనకనాల శంకర్, కంచర్ల రాములు, గోపగాని శివకృష్ణ, కంచర్ల రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.