అజీర్తి సమస్యతో భోజనాన్ని వీడిన గంగారం
- 83 ఏళ్ల వయస్సులోనూ చురుకుగా..
బైక్ నడుపుతూ అబ్బుర పరుస్తున్న వైనం
నిజామాబాద్, నవంబర్ 29 (విజయక్రాంతి): ఉప్పు, కారం, మసాలాలు లేనిదే ముద్ద కూడా దిగని ఈ రోజుల్లో సాత్విక ఆహారం, మంచినీళ్లు, వేరుశనక్కాయలు, పండ్లు, పాలు, మజ్జిగ ఆహారంగా తీసుకుం టూ నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు 83 ఏళ్ల గంగారం. 53 ఏళ్లుగా కేవలం పాలు, పండ్లు ఆహారంగా తీసుకుంటూ ఎంతో ఆరోగ్యంగా ఉన్న గంగారాన్ని చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. జక్రాన్‌పల్లి మండలం కొలిపాక గ్రామానికి చెందిన గంగారానికి 5౨ ఏళ్ల క్రితం అజీర్తి సమస్య తలెత్తడంతో అప్పటినుంచి ఉదయం, సాయంత్రం వేళ పాలు, పం డ్లు తింటున్నాడు.
1971 నుం చి జీర్ణ ప్రక్రియ మందగించడం, ఆరోగ్యం క్షీణించడం ఇతర సమస్యల తో బాధపడేవాడు. భోజనం చేసిన తర్వాత 30 కిలోమీటర్ల దూరం సైకిల్‌పై ప్రయాణిస్తే గానీ జీర్ణం అయ్యేది కాదని గంగారం తెలిపాడు. ఈ క్రమంలో 30 ఏళ్లపాటు కేవలం వేరుశనగ పలుకులు.. గత 20 ఏళ్లుగా పండ్లు, పాలు, నీళ్లు, మజ్జిగ, పెరుగు ఆహారంగా తీసుకుంటున్నట్టు గంగారం తెలిపాడు.
ఉపాధ్యాయుడిగా పనిచేసిన ఆయన ఇప్పటికీ స్వయంగా బైక్ నడుపుతూ పనులు చేసుకుంటున్నాడు. తాను ఇప్పటివరకు అనారోగ్యానికి గురి కాలేదని.. మాత్ర లు, ఇంజక్షన్ లాంటివి కూడా తీసుకోలేదని చెబుతున్నాడు. జంక్ ఫుడ్, మాంసాహారానికి బదు లు సాత్విక ఆహారం తింటూ ఆరోగ్యంగా ఉండాలని గంగారం సూచిస్తున్నారు. అవసరమైన పోషకాలతో కూడిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల శరీరాన్ని నియంత్రణలో ఉంచుకోవచ్చని 83 ఏళ్ల గంగారం నిరూపిస్తున్నాడు.
సాధనచేస్తే ఏదైనా సాధ్యపడు తుందని ఆయన చెబుతున్నాడు. మంచి గాలి, మంచినీరు, సాత్విక ఆహారంతో మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుందని గంగారం అంటున్నారు. పూర్వకాలం మును లు, మహర్షులు ఫలాలు భుజించారని.. చిన్పప్పుడు తనకు ఉపాధ్యాయులు ఇచ్చిన ప్రోత్సహం మేరకు తాను కూడా ఆ దిశగా నడిచినట్టు వెల్లడించారు. మంచినీళ్లు, పండ్లు, పాలు ఆహారంగా తీసుకోవడంతో తన ఆరోగ్యం మెరుగుపడి జీర్ణక్రియ సుఖవంతమైనట్టు గంగారం తెలిపారు.