25 May, 2026 | 1:47 AM

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం

25-05-2026 12:00 AM

లక్ష్మీదేవిపల్లి  రిజర్వాయర్ భూసేకరణకు రూ.583 కోట్లు మంజూరు

షాద్ నగర్ మే 24 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వాహించారు.  లక్ష్మీదేవిపల్లి  రిజర్వాయర్ భూసేకరణకు రూ.583 కోట్లు మంజూరు షాద్ నగర్ నియోజకవర్గ చరిత్రలో ఇదొక మైలురాయి అంశమని కనివిని ఎరుగని రీతిలో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ రాష్ట్ర మంత్రులు జిల్లా ఎమ్మెల్యేల కృషి ప్రశంసనీయమని కుందుర్గు మండల పార్టీ అధ్యక్షుడు, పార్లమెంటరీ నాయకుడు పురుషోత్తం రెడ్డి ప్రశంసించారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పాలాభిషేకం  పెద్ద ఎత్తున చేశారు.  ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బసవేశ్వర్, వైస్ ఛైర్మన్ అందే మోహన్ ముదిరాజ్,మాజీ మున్సిపల్ ఛైర్మన్ అగ్గనూర్ విశ్వం, పట్టణ అధ్యక్షుడు నల్లమోని శ్రీధర్ ముదిరాజ్, కౌన్సిలర్ పెంటయ్య, కొప్పునూరి ప్రవీణ్,బచ్చలి నరేష్, దిలీప్, బాలరాజు గౌడ్, శ్రీనివాస్, సాదిక్, ముబారక్  అలీ ఖాన్, సోలిపూర్ అనీల్, జయప్రకాష్ , నీరటి  వాసు, అర్జున్ లక్ష్మణ్ మంగ మధు, ప్రదీప్ ముదిరాజ్, మనీష్ , తదితరులు హాజరయ్యారు..