21-03-2025 10:26:41 PM
బీసీ,ఎస్సీ రిజర్వేషన్ చారిత్రాత్మకం
కోదాడ కాంగ్రెస్ నేతలు హర్షం వ్యక్తం
కోదాడ,(విజయక్రాంతి): బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఎస్సి వర్గీకరణ చేస్తూ అసెంబ్లీలో ఆమోదించడం పట్ల కాంగ్రెస్ నేతలు హర్షం వ్యక్తం చేశారు. కోదాడ మండల పరిధిలోని గణపవరం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ఫ్లెక్సీ లకు బీసీ నాయకులు, దళిత సంఘ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసి పాలాభిషేకం చేశారు. అనంతరం పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు తోమాటి వరప్రసాద్ రెడ్డి, ఉపాధ్యక్షుడు ఇర్ల సీతారాంరెడ్డి, అమర్నాయిని వెంకటేశ్వరరావు, నరపురెడ్డి, లక్ష్మారెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు నాగప్రసాద్, బండి చిన్నకోటయ్య, తదితరులు పాల్గొన్నారు.