calender_icon.png 15 March, 2025 | 11:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమరవీరుల ఆశయాలు కొనసాగించేందుకు సమరశీల పోరాటాలు నిర్వహించాలి

15-03-2025 01:00:17 AM

సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి

కరీంనగర్, మార్చి 14 (విజయ క్రాంతి): భూమి కోసం,భుక్తి కోసం,వెట్టిచాకిరి విముక్తి కోసం, అణగారిన వర్గాల కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా వదిలిన తెలంగాణ రైతాంగ సాయిధ పోరాట అమరవీరుల ఆశయాలను కొనసాగించడానికి భారత కమ్యూనిస్టు పార్టీ(సీపీఐ) శ్రేణులు మరింత పట్టుదలతో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజా ఉద్యమాలు నిర్వహించాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు.

శుక్రవారం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు, సీపీఐ కరీంనగర్ జిల్లా మొట్టమొదటి కార్యదర్శి అనభేరి ప్రభాకర్ రావు 77వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి సీపీఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి తో కలిసి చాడ వెంకటరెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని మతోన్మాద బిజెపి పార్టీ వక్రీకరిస్తుందని వారి మాటలను తిప్పికొట్టేందుకు సీపీఐ శ్రేణులు సిద్ధం కావాలని వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పొనగంటి కేదారి, జిల్లా కార్యవర్గ సభ్యులు కొయ్యడ సృజన్ కుమార్, అందె స్వామి, బోయిని అశోక్, కసిరెడ్డి సురేందర్ రెడ్డి, గూడెం లక్ష్మీ, టేకుమల్ల సమ్మయ్య, జిల్లా కౌన్సిల్ సభ్యులు కటికారెడ్డి బుచ్చన్న యాదవ్, పైడిపల్లి రాజు, పిట్టల సమ్మయ్య, నాలువాల సదానందం, బోనగిరి మహేందర్, న్యాలపట్ల రాజు, తదితరులు పాల్గొన్నారు.