calender_icon.png 21 January, 2025 | 4:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్రమ మైనింగ్‌పై గళమెత్తిన మైలారం

21-01-2025 01:54:35 AM

  1. పౌరహక్కుల నేతల మద్దతుతో అప్రమత్తమైన పోలీసులు
  2. పోలీసులను అడ్డగిస్తూ గ్రామంలో ముళ్లకంచె 
  3. ఎక్కడికక్కడ అరెస్ట్‌లు, నిర్బంధాలు

మైలారం గుట్ట మాయం’ అనే శీర్షికన గత నవంబర్ 10న విజయక్రాంతి ప్రత్యేక కథనం

నాగర్‌కర్నూల్/అచ్చంపేట, జనవరి 20 (విజయక్రాంతి) : అక్రమ మైనింగ్‌పై ఆ గ్రామం మరోసారి నిరసనకు దిగింది. గ్రామస్థులు రిలే నిరాహార దీక్షలకు పూనుకున్నారు. సోమవారం రిలే నిరాహార దీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యం లో గ్రామస్థులకు పౌర హక్కుల సంఘం మద్దతు ప్రకటించింది.

నాగర్‌కర్నూల్ అచ్చంపేట నియోజకవర్గం బల్మూర్ మండలం మైలారం గ్రామంలో ఒక్కసారిగా పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. గ్రామంలో పోలీసులు మోహరించి మూడెంచల భద్రతను ఏర్పాటు చేస్తూ గ్రామస్థులను ఎక్కడికక్కడ నిర్భంధించారు. దీంతో మహిళలు, యువకులు, ముసలిముతక అంటూ తేడా లేకుండా తమ ఊరి ఉనికి కోసం ఒక్క టై పోలీసులను ఎదురించారు.

గ్రామంలోకి పోలీసులు, ఇతర వాహనాలను అనుమతించకుండా ముళ్లకంచెను ఏర్పాటు చేశారు. తమ భర్తలను, గ్రామ యువకులను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ పురు గుల మందు డబ్బాలతో ఆత్మహత్యాయత్నానికి యత్నించారు. దీంతో కొద్దిసేపు పోలీసు లకు, గ్రామస్థుల మధ్య తీవ్ర వాగ్వివాదం, తోపులాట చోటు చేసుకుంది. దీంతో సందిగ్దంలో పడ్డ పోలీసు అధికారులు రిలే నిరా హార దీక్షలను విరమించుకోవాలన్న డిమాండ్‌తో గ్రామస్థులను వదిలిపెట్టేందుకు అంగీ కరించారు. 

గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో అక్రమంగా మైనింగ్‌కు అనుమతులు పొందిన కొందరు,  ఏండ్ల తరబడి ఆ గ్రామ ఆలయాలు, పాఠశాలలు, స్మశాన వాటికలను సైతం పూర్తిగా తుడిచి పెట్టుకుని పోయేలా అడుగులు వేశారు. అక్రమ మైనింగ్‌ను ఆపాలని మైలారం గ్రామస్థులు రాష్ట్ర స్థాయి వరకు ఆయా సందర్భాల్లో నిరసనను వ్యక్తం చేస్తూనే ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయా రు.

కాని అటవీశాఖ నిబంధనలను కూడా పాటించకుండా అక్ర మ అనుమతులు పొందిన మైనింగ్ మాఫియాకే గత ప్ర భుత్వం అండగా నిలిచింది. మొదట 2018 లో గుట్టపై అక్రమం గా అనుమతులను పొందారు. గ్రామస్తులు నిలువరించడంతో బీఆర్‌ఎస్ నాయకుల చొరవతో గ్రామ సభ తీర్మా నం ఇచ్చినట్లు నకిలీ పత్రాలు సృష్టించి అనుమతులకు గ్రీన్ సిగ్నల్ వచ్చేలా కొందరు బీఆర్‌ఎస్ నేతలే చక్రం తిప్పారని ఆరోపణలు ఉన్నాయి.

అనంతరం అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి ప్రతిపక్ష హోదాలో ఉన్న ప్రస్తుత ఎమ్మెల్యే వంశీకృష్ణ బలమైన హామీ మేరకే కాంగ్రెస్ పార్టీ వైపు గ్రామస్థులు మొ గ్గు చూపారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కూడా మైనింగ్ మాఫియా తన పనిని కొనసాగిస్తుడడంతో మళ్లీ మోసపోయామని గ్రహించిన గ్రామస్తులు పలు రూపాల్లో నిరసన వ్యక్తం చేశారు. గ్రామస్థులంతా మూకుమ్మడిగా పార్లమెంట్ ఎన్నికలను సైతం బహిష్కరించారు.

అయినా గత కలెక్టర్ తన ఉనికి కోసం అదే గ్రామ ఓటర్ లిస్ట్‌లో ఉన్న పక్క గ్రామంలోని వ్యక్తులను బలవంతంగా తీసుకువచ్చి ఓటు నమోదు చేయించి చేతులు దులిపేసుకున్నారు. ఇదే విషంపై ‘మైలారం గుట్ట మాయం’ అనే శీర్షికన గతేడాది నవంబర్ 10న విజయక్రాంతి ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. వీరి పోరాట పటిమను గుర్తించిన ప్రజా సంఘా లు సంపూర్ణ మద్దతును ప్రకటించాయి.

ఈనెల 5న హైదరాబాద్‌లోని ఓ ప్రాంతం లో ప్రజా సంఘాలు, గ్రామస్థులు మైలారం గ్రామ పరిరక్షణ కమిటీ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించాయి. క్రితం గ్రామస్థులంతా శాంతియుతమైన రిలే నిరాహార దీక్షలకు పూనుకుంటున్నట్లు రెండు రోజుల బల్మూర్ పోలీసులకు అర్జీ మెమెండరం పెట్టుకున్నారు.

సోమవారం రిలే నిరాహార దీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో గ్రామస్థులకు మద్దతు ప్రకటించేందుకు పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గడ్డం లక్ష్మణ్, ప్రజా సంఘాల నాయకుడు ప్రొఫెసర్ హరగోపాల్, ఇతర ప్రజా సంఘాల నాయకులు మైలారం గ్రామానికి బయలుదేరారు.

వెల్దండ పోలీసులు వారిని అదుపు లోకి తీసుకున్నారు. తర్వాత రిలే నిరాహార దీక్షలకు వెళ్లొద్దన్న సూచనతో స్వంత పూచికత్తుతో వారిని విడిచిపెట్టారు. దీంతో ప్రస్తుతం ఆ గ్రామంలో ఎప్పుడు ఏం జరుగుతోందన్న ఆందోళన సర్వత్రా  వ్యక్తమవుతున్నది.