ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన జేక్ పాల్, మైక్ టైసన్ మధ్య శుక్రవారం రాత్రి జరిగిన పోరులో యూట్యూబర్ జేక్ పాల్ టైసన్ ను సులభంగా మట్టికరిపించారు. 78-74 తేడాతో 58 ఏళ్ల టైసన్ ను ఓడించాడు. మైక్ టైసన్, జేక్ పాల్ మధ్య 8 రౌండ్లలో పోరు జరిగింది. తొలి రెండింటిల్లోనే మైక్ టైసన్ గెలిచారు. మిగితా ఆరు గౌండ్లలో జేక్ పాల్ ఆధిపత్యం కనబరిచారు. టెక్సాస్ లోని ఆర్లింగ్టన్ లోని ఎటీ అండ్ టీ స్టేడియంలో 60 సెకన్ల పాటు ఫ్యాన్స్ ను థ్రిల్ చేయగల్గినట్లు కనిపించాడు.
మైక్ టైసన్ మాజీ ప్రపంచ హెవీవెయిట్ బాక్సింగ్ ఛాంపియన్ అయిన విషయం అందరికీ తెలుసు. ఆయన 1985లో బాక్సింగ్ లోకి అడుగుపెట్టి 1986లో 20 ఏళ్ల వయసులోనే ట్రివర్ బెర్బిక్‌ను ఓడించి హెవీ వెయిట్ ఛాంపియన్ షిప్‌ను గెలుచి రికార్డు బద్దలు కొట్టాడు. టైసన్ కెరీర్‌లో 50 విజయాలు సాధించగా అందులో 44 నాకౌట్ విజయాలు ఉన్నాయి. మైక్ టైసన్ 2005లో రిటైర్ అయ్యాడు.
మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం లైగర్. ధర్మా ప్రొడెక్షన్స్, పూరీ కనెక్ట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించారు. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిన లైగర్ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదలైంది. ఈ చిత్రంలో బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్, టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ మధ్య ఫైట్ సీన్ అందరినీ ఆకట్టుకుంది.