13-02-2025 02:12:53 AM
* పని ప్రదేశాల్లో మొక్కల పెంపకం
* వలస కూలీల నిర్వాకం
* పోలీసుల దాడి
* మొక్కలు ధ్వంసం
* నిందుతుల అరెస్ట్
సిరిసిల్ల,ఫిబ్రవరి 12,(విజయక్రాంతి): పని మాటున గంజాయి సాగు చేస్తూ, వాటిని విక్రయించడంతోపాటు సేవిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి పనుల కోసం వలస వచ్చిన కూలీలు, ప్రత్యామ్నాయ ఆదాయంపై దృష్టి సారించడంలో భాగంగా పని చేసే చోటనే గంజాయి మొక్కల సాగుకు పాల్పడుతున్నారు.
కొద్ది రోజులుగా ఈ దందా సాగుతుం డగా పక్కా సమాచారం మేరకు పోలీసులు దాడులు చేశారు. సిరిసిల్ల పట్టణ పరిధి లోని పెద్దురు శివారులో గల మెడికల్ కాలేజీ పక్క న ఒడిస్సా కూలీలు వలస వచ్చి పనులు చే స్తున్నారు. అదే ప్రాంతంలో వారు నివసి స్తున్న రేకుల షెడ్డులో గంజాయి విత్తనాలు చల్లి, వాటికి నిత్యం నీళ్లు పోసి పెంపకం చేప ట్టారు.
పెరిగిన గంజాయి మొక్కలను ఎండ బెట్టి, వారు సేవించడంతోపాటు అక్కడ పని చేస్తున్న కూలీలకు విక్రయించి సొమ్ము చేసు కుంటున్నారు. ఈ దందా సాఫీగా సాగుతు న్న తరుణంలో పోలీసులకు పక్కా సమాచా రం మేరకు గంజాయి మొక్కలు సాగు చేసి న ప్రదేశం పై దాడి చేశారు. ఈ దాడుల్లో దాదాపు 52 గంజాయి మొక్కలను ధ్వంసం చేయగా, వాటి విలువ ప్రస్తుత మార్కెట్ విలువ రూ. 5 లక్షలు పైగా ఉంటుందని పోలీసులు అంచనా వేశారు.
ఒడిశా రాష్ట్రా నికి చెందిన దేబ్రటు ధాలి,మాలే మాలిక్ లు పెద్దూరుకు వలస వచ్చి, అక్కడ మెడికల్ కాలేజీ నిర్మాణంలో భాగంగా సెంట్రింగ్ పనులు చేసుకుంటూ అక్కడే నివసిస్తున్నా రు. ఈ క్రమంలో వారు నివసించే ప్రదేశం లో రేకుల షెడ్డులో ఈ గంజాయి సాగు మొక్కలను పెంపకం చేపట్టారు. అయితే వీరు సాగుచేసిన గంజాయి మొక్కలను ఎండబెట్టి సేవించడంతోపాటు అక్కడ పని చేస్తున్న ప్రణబ్ సింఘా, సాగర్ సర్కార్, జిబాన్ బిశ్వాన్, రంజిన్‌లు గంజాయి సేవి స్తున్నారు.
వీరి వద్ద 50 గ్రాముల గంజాయి తోపాటు తాగేందుకు వినియోగించే పైపుల ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్థానిక తహసిల్దార్ సమక్షంలో గంజాయి మొక్కలను ధ్వంసం చేయడంతో పాటు నిందితుల నుండి 6 మొబైలు, గంజాయి పైపులను స్వాధీనం చేసుకున్నట్లు సిరిసిల్ల టౌన్ సిఐ కృష్ణ తెలిపారు.
ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేపట్టి, గంజాయి విత్తనాలు ఎక్కడినుంచి వచ్చాయి, వీరింక ఎవరెవరికి విక్రయించారనే కోణంలో దర్యా ప్తు చేస్తున్నమన్నారు. గంజాయి సాగు చేసి న, విక్రయించిన కఠిన చర్యలు తీసుకుంటా మని, ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడి తే పోలీసులకు సమాచారం అందించాలని సీఐ కోరారు.