06-02-2025 12:00:00 AM
మానకొండూరు, ఫిబ్రవరి 5: ఒకప్పుడు గ్రామాల్లో వరినాట్లు మొదలయ్యాయంటే రైతుల పొలాల వద్ద పచ్చని పైరులతో సంద డి నెలకొనేది. ముఖ్యంగా మహిళలు వేరే పనికి వెళ్లకుండా నాట్లపైనే దృష్టి పెట్టేవారు. ఇప్పుడు అందుకు భిన్నమైన వాతావరణం పల్లెల్లో చోటు చేసుకుంది.
వరి నాట్లు వేసేం దుకు కూలీలు దొరకక రైతులు నానా ఇబ్బం దులు పడుతున్నారు. దీంతో నాలుగేళ్లుగా రైతులు వలస కూలీలు, యాంత్రాలపైనే ఆధారపడుతున్నారు. యంత్రాల కొరత, యంత్రాలు కొన్ని భూముల్లో నాట్లు వేసే పరిస్థితి లేక పోవడంతో మనుషులతో నా ట్లు వేయిస్తే పంట ఎక్కువగా వస్తుందని రైతులు కూలీల కోసం ఎదురు చూస్తున్నారు.
కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న రైతులు మహారాష్ర్టకు చెందిన గడ్చిరోలి, చంద్రాపూ ర్, పశ్చిమబెంగాల్, బీహార్, ఉత్తర ప్రదేశ్, చత్తీస్‌గఢ్, ఒడిస్సా, రాష్ట్రాల నుంచి కార్మికు లు వరి నాట్లు వేసేందుకు గ్రామాలకు చెంది న కొందరు రైతులు వలస లుగా వస్తున్నా రు.
కొంత మంది స్థానిక రైతులు ఆయా ప్రాంతాలకు చెందిన వలస కార్మికులను గ్రామాలకు తీసుకువచ్చి వారికి ఆశ్రయం కల్పిస్తున్నారు. వారితో ఎకరాకు ఒక ఫిక్స్డ్ ధరను ఒప్పందం చేసుకొని రైతుల నుంచి ఎక్కువ మొత్తం తీసుకొని వరి నాట్లు వేయిస్తున్నారు.
వలస కూలీలకు మంచి డిమాండ్
ఒక్కసారిగా రైతులంతా వరి నాట్లు వేసేం దుకు సిద్ధమయ్యారు. దీంతో వలస కూలీల కు మరింత డిమాండ్ పెరిగింది. కరీంనగర్, జిల్లావ్యాప్తంగా పలు మండలాల్లో ఇప్పటికే వలస కూలీలు వరి నాట్లు వేసే పనిలో నిమ గ్నమయ్యారు. మరో 10, 15 రోజుల్లో వరి నాట్లు పూర్తి చేయాల్సి ఉండడంతో వలస కూలీలకు మరింత డిమాండ్ పెరిగింది.
ఇప్ప టికే తిమ్మాపూర్ మండలానికే 15 మందితో కూడిన వలస కూలీలకు డిమాండ్ ఉండ డంతో బీహార్, చంద్రపూర్‌లతో పా టు ఇతర ఒక ప్రాంతాల నుంచి వారి బృందాన్ని రప్పిం చేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు.
వలస కూలీలతో కొరత తీరింది
ప్రతి ఏడాది వరి నాట్లు వేసేందుకు మా గ్రామంలో ఆడోళ్ళు వచ్చేసేటోళ్ళు. కానీ ఈసారి ఎవరిని అడిగినా రాకపోవ డంతో మాకు తెలిసిన వాళ్ళు బీహార్ నుంచి కూలీలు ఉన్నారు నాట్లు వేయిం చుకుంటారా అంటే వేసుకుంటున్నాం బీహార్ చంద్రపూర్ నుంచి 2 బ్యాచులు వచ్చాయి ఒక్కో బ్యాచ్‌కు ఎకరానికి 5,500/- ఇచ్చి 2 రోజుల నుంచి నాట్లు వేయిస్తున్నాను. నాకు రెండు ఎకరాలు ఉంది. ఇప్పుడు నాకు ఎలాంటి పరేషాన్ లేదు.
రాజమణి తిమ్మాపూర్