చేగుంట,(విజయక్రాంతి): వలస కార్మికులపై రాత్రి దుండగులు దాడి చేసి సంఘటన చేగుంటలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికు తెలిపిన వివరాలు ప్రకారం.... బీహార్ రాష్ట్రం దర్భంగా జిల్లా, చింతామణి ప్రాంతానికి చెందిన అఫ్జల్(38), మెదక్ జిల్లా చేగుంటలో జీవిక పరిశ్రమలో గత పది సంవత్సరాలగా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే బుధవారం రాత్రి ఇంటి నుండి టిఫిన్ కట్టుకొని డ్యూటీకి వెళ్తుండగా గ్రామపంచాయతీ వెనుక భాగంలో అఫ్జల్ పై గుర్తు తెలియని దుండగులు కత్తితో దాడి చేశారు.
దీంతో అఫ్జల్ చెంపపై తీవ్రంగా గాయమైంది. దుండగులను పట్టుకునేందుకు బాధితుడు ఎంత ప్రయత్నించిన వారు కనిపించలేదు. దీంతో స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న చేగుంట పోలీసులు క్షతగాత్రుడుని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం దాడి జరిగిన సంఘటనపై ఆరా తీశారు. మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ కు తరలించారు. అఫ్జల్ కు భార్య చాందిని ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు చేగుంట ఎస్ఐ శ్రీ చైతన్య రెడ్డి పేర్కొన్నారు.