వికారాబాద్, జనవరి- 30 : చెట్టు కొమ్మలను నరికేందుకు వచ్చిన వలస కూలి జీవితం రాలిపోయింది. కొమ్ములను నరికేస్తుండగా కొమ్ముతో పాటు కింద పడి మృతి చెందాడు. ఈ సంఘటన గురువారం తాండూరు పట్టణంలోని పోస్ట్ ఆఫీస్ వద్ద చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల లోని మూల స్తంభం తండాకు చెందిన తరుణ్ నాయక్ గత మూడేళ్ల క్రితం తాండూర్ కు వలస వచ్చాడు.
పట్టణంలోని కోడంగల్ రోడ్డు మార్గంలో ఉన్న ఎండి రెహమాన్ అనే వ్యక్తికి చెందిన కట్టెల మిషన్లో కూలీగా పనిచేస్తున్నాడు. గురు వారం తాండూరు పట్టణంలోని పోస్ట్ ఆఫీస్ వద్ద ఉన్న ఓ చెట్టు కొమ్మలను నరికేందుకు తరుణ్ నాయక్ వచ్చాడు. కొమ్ములను నరికే క్రమంలో ప్రమాదవశాత్తు కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య ఓ కూతురు ఉన్నారు కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.