- సురక్షితంగా తప్పించుకున్న పైలట్
- రాజస్థాన్ బార్మర్ సెక్టార్‌లో ఘటన
రాజస్థాన్, సెప్టెంబర్ 2: రాజస్థాన్ బార్మర్‌లో భారత వాయుసేనకు చెందిన మిగ్ ఫైటర్ జెట్ కూలిపోయింది. సాంకేతిక కారణం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి ముందే పైలట్ సురక్షితంగా యుద్ధ విమానం నుంచి బయటికి రావడంతో ప్రాణాపాయం తప్పింది. బార్మర్ సెక్టార్‌లోని వాయుసేన స్థావరంలో శిక్షణా మిషన్‌లో ఉండగా అకస్మాత్తుగా మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. ఖాళీగా ఉన్న వ్యవసాయ క్షేత్రాల్లో విమానం కూలిపోవడం వల్ల భారీ ప్రాణనష్టం తప్పిందని వాయుసేన వెల్లడించింది. ప్రమాదానికి గల కారణాలపై విచారణకు ఆదేశించినట్లు తెలిపింది. బార్మర్ జిల్లా కలెక్టర్ నిశాంత్ జైన్, ఎస్పీ నరేంద్రసింగ్ మీనా ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.