23-04-2025 03:54:03 PM
కంప్యూటర్లు, డెస్క్ బెంచీలు అందజేత
మహబూబాబాద్,(విజయక్రాంతి): మిడ్ వెస్ట్ కంపెనీ పేద విద్యార్థులకు చేయూతగా నిలుస్తోంది. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఉప్పరపల్లి, అర్పణ పల్లి ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న పేద విద్యార్థులకు అవసరమైన డెస్క్ బెంచీలను, రెండేసి చొప్పున కంప్యూటర్లను సమకూర్చింది. ఈ మేరకు బుధవారం మెడ్ వెస్ట్ మైన్స్ మేనేజర్ మూలవినేయేందర్ రెడ్డి, అకౌంట్స్ మేనేజర్ గౌండ్ల మల్లయ్య, హెచ్ ఆర్ నవీన్ చేతులమీదుగా ఆయా పాఠశాలలకు 2.92 లక్షల రూపాయల విలువైన 35 బెంచీలు, కంప్యూటర్లను అందజేశారు.