హైదరాబాద్,(విజయక్రాంతి): కార్తీక మాసంలో వన భోజనాలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఆధ్వాత్మిక చింతనతోపాటు ఆనందం, ఆరోగ్య సందేశాన్ని కార్తీక వనభోజనాలు మనకు చాటి చెబుతున్నాయి. మిడ్ టౌన్ అపార్ట్ మెంట్ వెల్పేర్ అసోసియేషన్ సభ్యులు కార్తీక వన భోజనాలు కీసర గుట్ట దగ్గర సోమవారం జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ జీ.రాజేశ్వర్, శ్రీనివాస్, జగదీష్, కృష్ణారెడ్డి, రాము, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.