04-04-2025 10:35:38 AM
హైదరాబాద్: కర్నూలు జిల్లా బోగీలు స్టేషన్(Kurnool District Bogolu Station) వద్ద వెంకటాద్రి ఎక్స్ ప్రెస్(Venkatadri Express)లో అర్ధరాత్రి చోరీ జరిగింది. క్రాసింగ్ కోసం వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ బోగీలు స్టేషన్ లో ఆగింది. ఇదే అవకాశంగా తీసుకున్న దుండగులు ఎస్ 2 బోగీలో ఇద్దరు మహిళల మెడలోంచి గొలుసులు లాక్కెళ్లారు. దీంతో బాధితులు చోరీపై కాచిగూడ స్టేషన్ లోని రైల్వే పోలీసులకు (Railway Police) ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.