calender_icon.png 1 February, 2025 | 6:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రధాని మోదీ గుండెల్లో మిడిల్ క్లాస్..

01-02-2025 03:17:00 PM

న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్ 2025లో పన్ను తగ్గింపులను ప్రశంసించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా(union home minister amit shah), మధ్యతరగతి ప్రజలు ఎప్పుడూ ప్రధాని మోదీ హృదయంలో ఉంటారని అన్నారు. 12 లక్షల వార్షికాదాయం ఉన్న వ్యక్తులకు పూర్తి మినహాయింపు ఇచ్చిన పన్ను శ్లాబుల పునరుద్ధరణను ఎత్తి చూపుతూ, మధ్యతరగతి ప్రజల ఆర్థిక శ్రేయస్సును పెంపొందించడానికి ఇది చాలా దోహదపడుతుందని అన్నారు. "ఈ సందర్భంగా లబ్దిదారులందరికీ అభినందనలు" అని అమిత్ షా ఎక్స్ లో పోస్ట్ చేసాడు. 

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Union Finance Minister Nirmala Sitharaman) శనివారం నాడు కేంద్ర బడ్జెట్ 2025ను సమర్పిస్తూ, కొత్త పన్ను విధానంలో రూ. 12 లక్షల వరకు - అంటే స్టాండర్డ్ డిడక్షన్‌లతో కలిపి రూ. 12.75 లక్షల వరకు ఎలాంటి ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని ప్రకటన చేశారు. సవరించిన స్లాబ్‌ల ప్రకారం, రూ. 4 లక్షల వరకు ఆదాయంపై పన్ను శూన్యం. రూ. 4 నుంచి రూ. 8 లక్షల మధ్య పన్ను ఐదు శాతం ఉంటుంది. రూ.8 నుంచి రూ.12 లక్షల మధ్య ఇది ​​10 శాతంగా ఉంటుంది. రూ.12 లక్షల నుంచి రూ.16 లక్షల మధ్య 15 శాతం, రూ. 16 లక్షల నుంచి రూ. 20 లక్షల మధ్య 20 శాతం, రూ. 20 లక్షల నుంచి రూ. 24 లక్షల మధ్య 25 శాతం ఉంటుంది. 24 లక్షలకు పైబడిన ఆదాయం 30 శాతం పన్ను పరిధిలోకి వస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి వెల్లడించారు.