calender_icon.png 16 April, 2025 | 3:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మధ్యాహ్న భోజన కార్మికులకు పదివేల వేతనం చెల్లించాలి

14-04-2025 06:35:27 PM

బాన్సువాడ (విజయక్రాంతి): బాన్సువాడ పట్టణంలోనీ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సోమవారం తెలంగాణ రాష్ట్ర మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ జిల్లా రెండవ మహాసభను యూనియన్ జిల్లా నాయకులు సోఫియా అధ్యక్షతన బాన్సువాడ పట్టణంలోని జిల్లా పరిషత్ హై స్కూల్లో నిర్వహించడం జరిగింది. మహాసభ ప్రారంభానికి ముందు బస్టాండ్ పక్కనగల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలను వేసి నివాళులర్పించడం జరిగింది.

ఈ మహాసభకు ముఖ్య అతిథులుగా ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి వై. ఓమయ్య, మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు టి. చక్రపాణి లు హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ మధ్యాహ్న భోజన పథకం ఈ దేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా బడి బయట ఉన్న పేద పిల్లలను బడికి రావడానికి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం పెంచటం కోసం నాణ్యమైన భోజనాన్ని అందించడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మధ్యాహ్న భోజన కార్మికుల ద్వారా ఈ పథకాన్ని అమలు చేయడం జరుగుతుందని అన్నారు.

సదుద్దేశంతో పథకం ప్రారంభించిన కార్మికులకు ప్రతినిలా బిల్లులు చెల్లించకపోవడంతో వేతనాలు పెంచకపోవడంతో పాఠశాలల్లో వంట గదులను నిర్మాణం చేయకపోవడంతో పథకం అమలు సరైన పద్ధతిలో జరగడం లేదన్నారు. ఎన్నికలు వస్తే కార్మికుల గుర్తొస్తారని తర్వాత వారిని ప్రభుత్వాలు మరచిపోతాయని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు మధ్యాహ్నం భోజన కార్మికులకు పదివేల రూపాయల వేతనాన్ని చెల్లిస్తామని హామీ ఇవ్వడం జరిగిందని దాన్ని అమలు చేయాలన్నారు. మధ్యాహ్న భోజన కార్మికులకు ఇన్సూరెన్స్ కల్పించాలని, గుర్తింపు కార్డులు ఇవ్వాలని, యూనిఫారం ఇవ్వాలని, పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూ జిల్లా కార్యదర్శి బాలరాజ్ ఉపాధ్యక్షులు దశరథ్ దుబాస్ రాములు డివిజన్ కార్యదర్శి శంకర్ నాయకులు సురేష్, వెంకట్ వివిధ మండలాల నాయకులు కార్మికులు తదితరులు పాల్గొన్నారు.