హైదరాబాద్, నవంబర్ 27 (విజయక్రాంతి): మిడ్ డే మీల్స్ (మధ్యా హ్న భోజన పథకం) ధరలను కేంద్రం పెంచింది. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఒక్కో విద్యార్థికి రూ.5.45 నుంచి రూ.6.19కి పెంచింది. 6 నుంచి 8వ తరగతులకు రూ.8.17 నుంచి రూ.9.26కు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనున్నది. ఈ నిధుల్లో కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం నిధులను కేటాయించాల్సి ఉంటుంది.