ఇబ్రహీంపట్నం, నవంబర్ 27 (విజయక్రాంతి): ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని శేరిగూడ ప్రభుత్వ పాఠశాలను బుధవారం రాష్ట్ర విద్యాశాఖ కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి సందర్శించారు. మధ్యాహ్నం భోజన పథకం అమలు తీరుపై సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులను ఆరా తీశారు. బిల్లుల చెల్లింపులో ఆలస్యం జరుగుతునట్లు తమ దృష్టి వచ్చిందని నిర్వాహకులను ఆరా తీశారు. దీంతో నిర్వాహకులు బిల్లులు పెండింగ్‌లో ఉన్న విషయం వాస్తవమేనని, తమకు నెలల తరబడి రావడం లేదని వాపోయారు.