హైదరాబాద్: బ్లూ స్క్రీన్ ఎర్రర్‌పై మైక్రోసాఫ్ట్ స్పందించింది. అతి త్వరలో సమస్య పరిష్కరిస్తామని మైక్రోసాఫ్ట్ ట్వీట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ విండోస్ సేవలకు అంతరాయం కలిగింది. కొన్ని పీసీల్లో విండోస్-11, 10లో ఆపరేటింగ్ సిస్టమ్‌లో సమస్య తలెత్తింది. ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ సేవలకు అంతరాయం కలగడంతో మైక్రోసాఫ్ట్ 365 యాప్స్ సేవల్లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో బ్యాంకులు, విమానయాన సంస్థలు, టెలికాం, మీడియా సహా అనేక రంగాలపై తీవ్ర ప్రభావం పడింది. లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ లో సేవలు నిలిచిపోకపోగా, అమెరికాలో ఎమర్జెన్సీ సేవల నంబర్ 911 పై ప్రభావం పడింది. భారత్‌లో విమాన, ఐటీ సేవలకు అంతరాయం కలిగింది. మైక్రోసాఫ్ట్ సమస్యతో ప్రపంచవ్యాప్తంగా విమాన సేవలకు తీవ్రతరాయం కలిగింది. మైక్రోసాఫ్ట్ లోపల తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా అమెరికా సహా అనేక దేశాల్లో విమాన సేవలు నిలిచిపోయాయి. ఆన్‌లైన్ టికెట్ బుకింగ్, ఆన్‌లైన్ సేవలపై తీవ్ర ప్రభావం పడింది.