షాద్‌నగర్‌లోని ఫరూఖ్‌నగర్‌లో 48 ఎకరాల భూమి కొనుగోలు
హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, మే 11 (విజయక్రాంతి): దిగ్గజ కంపెనీ మైక్రోసాఫ్ట్ హైదరాబాద్‌లో భూమి కొనుగోలు చేసింది. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ సమీపంలోని ఫరూఖ్‌నగర్ మండలం ఎలికట్ట గ్రామంలో 48 ఎకరాల భూమిని రూ.267 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. ఒక ఎకరం భూమిని దాదాపు రూ.5.56కోట్లకు మైక్రోసాఫ్ట్ కొనుగోలు చేసినట్లు సమాచారం. ఏప్రిల్ 18వ తేదీన ఇందుకు సంబంధించిన సేల్‌డీడ్ జరిగింది. 2022లోను హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ భారీ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు సుమారు రూ.275 కోట్లకు భూమి కొనుగోలు చేసిన సంగతి విధితమే.