calender_icon.png 8 January, 2025 | 8:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సత్య నాదెళ్లతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ

30-12-2024 04:47:02 PM

హైదరాబాద్‌: మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్యనాదెళ్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సమావేశం కాసేపటి క్రితమే ముగిసింది. సత్య నాదెళ్లతో భేటీలో మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పాల్గొన్నారు. స్కిల్ యూనివర్సిటీలో మైక్రోసాఫ్ట్ భాగస్వామ్యం, ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ ప్రతిపాదనలపై సత్యనాదెళ్లతో సీఎం చర్చించారు. ఏఐ సిటీలో ఆర్అండ్ డీ, కంప్యూటింగ్‌ లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్  ఏర్పాటుకు సహకారంపై నాదెళ్లతో చర్చలు జరిపారు. క్లౌడ్ కంప్యూటింగ్ సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ లో కీలక పాత్ర పోషించాలని రేవంత్ రెడ్డి కోరారు. ఓపెన్ ఏఐ నుంచి ఉచిత క్రెడిట్స్ ఇవ్వాలని సత్యనాదెళ్ల(Microsoft CEO Satya Nadella)ను సీఎం రేవంత్ కోరారు. రాష్ట్రంలో 4 డేటా సెంటర్లు, హైదరాబాద్ కేంద్రం విస్తరణపై ముఖ్యమంత్రి చర్చించారు.