calender_icon.png 19 January, 2025 | 10:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మైక్రో ఆగడాలకు అడ్డుకట్ట పడాలి

17-01-2025 12:00:00 AM

ఉమ్మడి రాష్ట్రంలో 2010--11 సంవత్సరంలో అనేక వందల యువతీ యువకుల మరణాలకు కారకులైన మైక్రో ఫైనాన్స్,నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్లు తిరిగి తెలంగాణ రాష్ట్రంలో ఆదివాసి గిరిజన పేద గ్రామాలను లక్ష్యంగా చేసుకుని విస్తరిస్తూనే ఉన్నాయి.

ఇటీవలి కాలంలో రాష్ట్రంలోని ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆంధ్ర ప్రదేశ్‌లోని తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలలో ఆదివాసీ గిరిజన పేద ప్రజలు నివసించే అనేక గ్రామా లు, తండాలు, కోయ గూడేలను మైక్రో ఫైనాన్స్ కంపెనీల స్థావరాలుగా ఏర్పరచుకున్నాయి. కేవలం మూడు నెలల కాలానికి 20వేల రూపాయలు అప్పుతో పాటు 5,000 రూపాయ ల వడ్డీ వసూలు చేస్తూ పేద వర్గాలను అప్పుల వలయంలో చిక్కిస్తున్నాయి. సకాలంలో చెల్లించకపోతే అద నపు అపరాధ వడ్డీల వసూళ్లు మామూలే. 

పొదుపు ఉద్యమానికి సమాంతరంగా

తెలంగాణ రాష్ట్రంలో మహిళా సంఘా ల అభివృద్ధి ఉద్యమంలో భాగంగా ప్రభు త్వ బ్యాంకుల ద్వారా ప్రతి సంవత్సరం దాదాపు 25 వేల కోట్ల రూపాయల రుణాలు పేద మహిళలు తీసుకుంటూనే ఉన్నారు. మహిళా సంఘాల పొదుపు పరపతి ఉద్యమానికి సమాంతరంగా మైక్రో ఫైనాన్స్ కంపెనీలు కూడా తమ అధిక వడ్డీల అక్రమ వసూళ్లు కొనసాగిస్తున్నారు.

గత పది సంవత్సరాల నుండి రాష్ట్రంలో నాణ్యమైన ప్రభుత్వ విద్య, వైద్యం లభించక పోవడం వలన ప్రజలు ప్రైవేటు విద్య, ప్రైవేటు వైద్యాన్ని ఆశ్రయించక తప్పడం లేదు. ఈ క్రమంలో ప్రజల ఆదాయాలు పూర్తిగా వీటికే చెల్లించాల్సిన పరిస్థితులు దాపురించాయి. మహిళా సంఘాలు, రైతు లు. ఇతర నిరుద్యోగులు బ్యాంకులనుండి రుణాలు తీసుకున్నంత మాత్రాన సరిపోవడం లేదు.

అందుకే ఇతర మార్గాలకు చొరవ చూపుతున్నారు. ఇది ఆసరాగా తీసుకొని అత్యధిక వడ్డీలను, అపరాధ రుసుంలను వసూలు చేయడానికి అనేక ఫైనాన్స్ కంపెనీలు ప్రత్యక్షమవుతున్నాయి. అందులో భాగంగానే మైక్రో ఫైనాన్స్ కంపెనీలు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు ఆవిర్భవిస్తున్నాయి.

ఈ మైక్రో, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల పరపతి విస్తరణపై కానీ, ఆ కంపెనీలు వసూలు చేసే వడ్డీ, అపరాధ రుసుంలకు ప్రభుత్వ అనుమతులు ఉన్నాయా లేదా అనేది ఒక పెద్ద ప్రశ్న. ప్రభుత్వ అధికారులు కూడా ఈ మైక్రోఫైనాన్స్ అక్రమ కార్యక్రమాలను చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నట్లు బాధితులు అభిప్రాయపడుతున్నారు.

రోశయ్య చొరవతో చట్టం

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2006 నుండి 2010 వరకు కొన్ని మైక్రో ఫైనాన్స్ కంపెనీలు ముఖ్యంగా ఎస్‌కె ఎస్, ఎల్ అండ్‌టి, షేర్ మొల్ల ఇంకా అనేక పేర్లతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 600 కోట్ల రూపాయల వరకు పరపతి విస్తరించి అక్రమ వడ్డీలు 30 నుండి 50 శాతం వసూలు చేస్తున్న సందర్భంలో మైక్రో సంస్థల అక్రమ వసూలు నిర్బంధాలు భరించలేక వందకు పైగా రుణగ్రహీతలు ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది.

సమస్య తీవ్రతను గమనించిన ప్రజా సం ఘాలు, భారత కమ్యూనిస్టు పార్టీ, ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు ప్రొఫెసర్లు, ఇతర మేధావులు పెద్ద ఎత్తున ఉద్యమాలను చేపట్టడం వల్ల ఆనాడు ముఖ్యమం త్రిగా ఉన్న కొణిజేటి రోశయ్య అప్పటి ప్రధానమంత్రి, సమస్య తీవ్రతను అర్థం చేసుకున్న గొప్ప పరిపాలనా దక్షుడు మన్మోహన్ సింగ్, యుపిఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీని సంప్రదించి, ఒప్పించి కేంద్ర ప్రభుత్వ అనుమతితో మైక్రో ఫైనా న్స్ రెగ్యులేటరీ చట్టాన్ని 2011లో రూపొందించడం జరిగింది.

ఈ చట్టం ప్రకారం నిర్బంధ వసూళ్లు చేయడం కానీ ఒక కుటుంబానికి మల్టిపుల్ రుణాలు ఇచ్చిన పక్షంలో మైక్రో ఫైనాన్స్ కార్పొరేషన్లను, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్లను చట్టరీత్యా ప్రాసిక్యూట్ చేస్తారు. ఈ కారణంగా మైక్రో ఫైనాన్స్ కంపెనీలన్నీ తమ కార్యకలాపాలను మూసుకొని వెళ్లి పోయాయి.

మళ్లీ గత మూడు, నాలుగేళ్లనుండి గ్రామీణ ప్రాంతాల్లో మైక్రో ఫైనా న్స్ కంపెనీలు, పట్టణ ప్రాంతాల్లో నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్లు ఇబ్బడి ముబ్బడిగా ప్రారంభించి యువతను, పేద మహిళలను ఆకర్షించి అడిగినదే తడవుగా అధిక రేట్ల వద్ద అడిగినంత రుణాలు ఇస్తున్నాయి. రుణాలు ఇచ్చాక గూండాలను, ఏజెంట్లను నియమించి నిర్బంధ వసూళ్లకు పాల్పడడం, రకరకాలుగా వేధింపుల కు, అవమానాలకు గురి చేయడం ప్రారంభించారు.

గత కొంత కాలం నుండి తెలం గాణలో అనేక పల్లె, పట్టణ ప్రాంతాల్లో ఈ సంస్థల ఆగడాలు, వేధింపులు భరించలేక ఆత్మహత్యలు చేసుకోవడం ఒక సాధారణ సమస్యగా పరిణమించింది. ఈ తతంగమంతా అధికారులు, ప్రభుత్వ వర్గాలు గమనిస్తూనే ఉన్నాయి. అనేక ఉదంతాలు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కూడా ప్రభుత్వ వర్గాల దృష్టికి వచ్చినప్పటికీ తగిన చర్యలు తీసుకోవడం లేదని బాధిత కుటుంబాలు తెలియ జేస్తున్నాయి. 

యువతలో పెరిగిపోతున్న వ్యసనాలు

దీనికి తోడు ఆన్‌లైన్ బెట్టింగ్, డబ్బుల ఆటలు ఈ కాలపు యువతలో పెరిగిపోతున్నాయి. అనేక మంది యువకులు కొన్ని సందర్భాల్లో లక్షల రూపాయలు పోగొట్టుకున్న ఉదంతాలు కూడా వెలుగు చూస్తు న్నాయి. నష్టపోయిన ఇలాంటి యువకులుకూడా ఆత్మహత్యలకు పాల్పడుతున్నా రు. గంజాయి, నార్కోటిక్స్ లాంటి డ్రగ్స్ ఉపయోగం బాగా పెరిగిపోవడం వల్ల కూడా ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి.

గత ఏడెనిమిదేళ్ల నుండి ఇలాంటి కార్యక్రమాలు ప్రారంభమై ఇటీవల కాలంలో పెట్రేగి పోయి వాటి ఆగడాలు వికటిస్తున్నాయి. గ్రామాల్లో, పట్టణాల్లో నిత్యం అకాల మరణాలు, ఆత్మహత్యలు చోటు చేసుకుంటు న్నాయి.

గతంలో 2006-2009 యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వారి పరిశోధనా ప్రాజెక్టు, కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్థిక శాఖ ఆధ్వర్యంలో మహిళా సంఘాల పొదుపు ఉద్యమం- ఫలితాలు, మైక్రో ఫైనా న్స్ కార్పొరేషన్లు, వాటి ప్రభావంపై జరిగిన అధ్యయనంలో ఈ మైక్రో ఫైనాన్స్ కంపెనీల దుష్ప్రభావాల గురించి పరిశోధన పత్రాలు, మీడి యా ద్వారా ప్రచురించిన వ్యాసాల సందర్భంలోనే మైక్రో ఫైనాన్స్ కంపెనీలపై ఉద్య మం ప్రారంభమైంది.

అధిక వడ్డీల వసూ ళు,్ల ఆగడాలు, అకాల మరణాల గురించి ఈ అధ్యయనంలో విస్తృతంగా చర్చించడం జరిగింది. తత్పలితంగా మైక్రో ఫైనా న్స్ కంపెనీలపై ప్రజా ఉద్యమాలు రావ డం, అప్పటి ముఖ్యమంత్రి రోశయ్య మైక్రోఫైనాన్స్ రెగ్యులేటరీ చట్టం తేవడం జరిగింది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ల్లో మైక్రో ఫైన్స్ ఫైనాన్స్ సంస్థల ఆగడాలను మీడి యా ప్రచార సాధనాల ద్వారా తెలుసుకున్న జర్మనీ దేశస్థురాలు మౌనిక రిటరింగ్ తన స్వచ్ఛంద సంస్థ ద్వారా బాధిత కుటుంబాలకు, తల్లితండ్రులను కోల్పోయిన పిల్లలకు ఆర్థిక సహాయా న్ని అందిం చడం జరిగింది.

ప్రభుత్వం ఇప్పటికైనా ఈ మైక్రోసంస్థల, నాన్ బ్యాంకింగ్ ఫైనా న్స్ కంపెనీల ఆగడాలను అరికట్టడానికి రోశ య్య చర్యలను స్ఫూర్తిగా తీసుకొని ఒక సమగ్ర చట్టాన్ని రూపొందించి ఈ సంస్థ లు ఆగడాలను అరికట్టకపోతే యువ త, పేద వర్గాలు నిరంతరం ఈ సంస్థల దుర్మార్గపు చేష్టలకు బలి కావలసిన పరిస్థితి కొనసాగుతుందని సమాజం ఆందోళ న, ఆవేదన చెందుతున్నది.

అధికారులు తక్షణమే ఈ సంస్థల కార్యకలాపాలను నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉం దని క్షేత్ర పరిశీలన తెలియజేస్తున్నది. ప్రభుత్వం తీసుకుంటు న్న దిద్దుపాటి చర్యలకు సభ్య సమాజం కూడా తగిన సహకారం అం దించి ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలను నిర్వహిస్తున్న వ్యవస్థ లను, సంస్థల ను మార్కెట్లో వాటి ఉనికి లేకుండా చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది.

రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని రకాల సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినప్పటికీ ప్రజలను దోపిడీ చేసుకునే సంస్థలు ఉన్నంతకాలం ప్రభు త్వం చేసేప్రయత్నాలు బూడిదలో పన్నీరుగా మారిపోతాయని గ్రహించాల్సిన అవసరం ఉంది. ఇలా నిలువునా ప్రజలను దోపిడీ చేసే సంస్థలను అరికట్టవలసిన ఆవశ్యకతను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే గుర్తిం చాలని బాధిత సమాజం కోరుతున్నది.