కోల్‌కతా: ప్లేఆఫ్ బెర్త్ లక్ష్యంగా కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) సొంతగడ్డపై మ్యాచ్‌కు సిద్ధమైంది. శనివారం ఈడెన్ గార్డెన్ వేదికగా ఇప్పటికే సీజన్ నుంచి ఎలిమినేట్ అయిన ముంబై ఇండియన్స్‌తో కోల్‌కతా అమీతుమీ తేల్చుకోనుం ది. సీజన్‌లో కోల్‌కతా ఆడిన 11 మ్యాచ్‌ల్లో 8 విజయాలతో పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. 16 పాయిం ట్లతో ఉన్న ఆ జట్టు మరొక్క విజయం సాధిస్తే సీజన్‌లో ప్లేఆఫ్స్ చేరిన తొలి జట్టుగా నిలవనుంది. సొంతగడ్డపై ముంబైని ఓడించి బెర్తు ఖరారు చేసుకోవాలని కేకేఆర్ భావిస్తుంటే.. పోరాడితే పోయేదేమీ లేదన్న చందంగా ముంబై బరిలోకి దిగనుంది. గెలుపోటములతో సంబంధం లేని స్థితిలో ముంబై.. ప్రత్యర్థుల అవకాశాలను దెబ్బతీస్తుందా చూడాలి. కేకేఆర్ బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా కనిపిస్తోంది. ఓపెనర్లు ఫిల్ సాల్ట్, సునీల్ నరైన్‌లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. వీరిద్దరి హిట్టింగ్ వల్ల కోల్‌కతా ఈ సీజన్‌లో 8 మ్యాచ్‌ల్లో 200+ స్కోర్లను సాధించడం విశేషం. మిడిలార్డర్‌లో అంగ్‌క్రిష్ రఘువంశీ, శ్రేయస్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్, రమణ్‌దీప్ సింగ్‌లు రాణిస్తున్నారు. ఫినిషర్లుగా రింకూ సింగ్, రసెల్ అదరగొడుతున్నారు. ముంబై బ్యా టింగ్‌లో సూర్యకుమార్, తిలక్ మాత్ర మే నిలకడగా పరుగు లు సాధిస్తున్నారు. సీజన్‌లో ఇరుజట్ల మధ్య జరిగిన తొలి అంచె పోటీలో కోల్‌కతా విజయం సాధించింది.