calender_icon.png 14 November, 2024 | 6:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీ-సాట్‌తో ఎంజీ వర్సిటీ ఎంవోయూ

14-11-2024 12:31:08 AM

త్వరలో కుదరనున్న ఒప్పందం

హైదరాబాద్, నవంబర్ 13 (విజయక్రాంతి): నల్లగొండలోని మహాత్మాగాంధీ (ఎంజీ) వర్సిటీతో టీ-సాట్ నెట్‌వర్క్ ఎంవోయూకు సిద్ధమైంది. రాష్ట్రంలోనే ప్రత్యేకమైన టీటీఎం కోర్సును డిజిటల్ రూపంలో అందించేందుకు రెండు సంస్థలు అంగీకారం తెలిపాయి. మహాత్మాగాంధీ వర్సిటీ వీసీ ప్రొఫెసర్ అల్తాఫ్ హుస్సేన్ జూబ్లీహిల్స్‌లోని టీ-సాట్ కార్యాలయాన్ని బుధవారం సందర్శించారు.

ఈ సందర్భంగా వీసీతో టీ-సాట్ సీఈవో వేణుగోపాల్‌రెడ్డి డిజిటల్ ఎడ్యుకేషన్‌పై చర్చించారు. తెలంగాణ యువతకు, విద్యావంతులకు ఉన్నత విద్యాశాఖ పరిధిలోని వర్సిటీల సహకారంతో నాణ్యమైన డిజిటల్ ఎడ్యుకేషన్ అందించాలని భావిస్తున్నామని వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. ఇందుకోసం ప్రతిష్ఠాత్మకమైన మహాత్మాగాంధీ యూనివర్సిటీ సహకారం ఉండాలని కోరగా వీసీ అంగీకరించారు.

ప్రొఫెసర్ అల్తాఫ్ ఉస్సేన్ మాట్లాడుతూ.. తెలంగాణలో ఏ యూనివర్సిటీలో లేని డిమాండ్ గల ట్రావెలింగ్ అండ్ టూరిజం మేనేజ్‌మెంట్(టీటీఎం) కోర్సులో డిజిటల్ లెసన్స్ అందించేందుకు తమ వర్సిటీ సిద్ధంగా ఉందని చెప్పారు. టీటీఎంపై ప్రత్యేక ప్రాజెక్టు రిపోర్టు తయారు చేసి టీ ద్వారా డిజిటల్ పాఠాలు అందిస్తామని హామీ ఇచ్చారు.

వర్సిటీల ద్వారా విద్యాధికులు తయారు కావాలంటే భవిష్యత్‌లో విద్యా వ్యవస్థలో మరిన్ని మార్పులు జరగాలని అభిప్రాయపడ్డారు. టీ-సాట్ వేదికగా కార్యక్రమాలు చేపట్టేందుకు త్వరలోనే ఎంవోయూ చేసుకుందామని తెలిపారు.