calender_icon.png 29 October, 2024 | 12:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

త్వరలో మార్కెట్లోకి ఎంజీ మోటార్ ఈవీ ‘క్లౌడ్’

27-06-2024 01:38:36 AM

న్యూఢిల్లీ, జూన్ 26: ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో టాటా నెక్సాన్, బీవైఈ ఈ6, మహింద్రా ఎక్స్‌యూవీ 400తో పోటీపడేందుకు ఎంజీ మోటార్ త్వరలో ఒక కొత్త ఎలక్ట్రిక్ కారును ప్రవేశపెట్టాలని భావిస్తున్నది. ఎంజీ క్లౌడ్ ఈవీ పేరుతో ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఎంజీ మోటార్ విడుదల చేస్తుందని సమాచారం. దీని ధరను రూ.20 లక్షల లోపు నిర్ణయించవచ్చని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. క్లౌడ్ ఈవీ ధర రూ.20 లక్షల సమీపంలో ఉంటే ఈ కారు టాటా నెక్సాన్, బీవైఈ ఈ6, మహింద్రా ఎక్స్‌యూవీ 400లతో పోటీపడే వీలుంటుంది. దాదాపు ఇదే ధరంతో మారుతి సుజుకి కూడా సుజుకి ఈవీక్స్ పేరుతో ఒక ఈవీని తీసుకురాబోతున్నది.  క్రాసోవర్ ఎంపీవీ అయిన క్లౌడ్ ఈవీ స్టులిష్ డిజైన్‌తో 4.3 మీటర్లు ఉంటుందని, 360 డిగ్రీల కెమెరా,డ్యూయల్ డిజిటల్ స్క్రీన్స్, క్లుమైట్ కంట్రోల్, పవర్డ్ సీట్స్, సన్‌రూఫ్ తదితరాలతో లగ్జరీ క్యాబిన్‌ను కలిగిఉంటుందని చెపుతున్నారు.