calender_icon.png 5 November, 2024 | 12:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెక్సికన్ డ్రగ్ లార్డ్ అరెస్ట్

27-07-2024 04:58:06 AM

  1. అమెరికా, మెక్సికో సంయుక్త ఆపరేషన్
  2. పోలీసుల అదుపులో ఇస్మాయిల్ జంబాడా
  3. అతనితోపాటు పార్టనర్ ఎల్‌చాపో కుమారుడు జోక్విన్

వాషింగ్టన్, జూలై 26: ప్రపంచంలో మోస్ట్ వాంటెడ్ డ్రగ్ పెడ్లర్లలో ఇద్దరిని అమెరికా గురువారం అరెస్ట్ చేసింది.  ఇస్మాయెల్ ఎల్ మయో జాంబాడా గార్సియో (76), అతని పార్ట్‌నర్ జోక్విన్ ఎల్ చాపో కుమారుడు జోక్విన్ గుజమాన్ లోపేజ్ (35)లను కస్టడీలోకి తీసుకున్నట్లు అమెరికా న్యాయశాఖ వెల్లడించింది. వీరిద్దరూ మెక్సికోలో అతిపెద్ద నేర సంస్థ సినలోవాకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు గుర్తించారు. ఈ సంస్థ గత మూడు దశాబ్దాలుగా మెక్సికోలో భారీ హింసాత్మక ఘటనలకు కారణమైందని, అతిపెద్ద క్రిమినల్ సంస్థల్లో సినలోవా ఒకటిగా ఉందని అధికారులు తెలిపారు. 

ఎలా దొరికారంటే.. 

ఓ ప్రాంతంలో పెట్టిన పెట్టుబడులను పరిశీలించేందుకు జాంబాడా, లోపేజ్‌తో కలిసి విమానంలో ప్రయాణించారు. అయితే, పక్కా ప్లాన్ ప్రకారమే వారికి తెలియకుండా వారు ప్రయాణిస్తున్న విమానాన్ని అమెరికాకు తరలించారు. అమెరికాలో ల్యాండ్ కాగానే వారిని పోలీసులు అరెస్టు చేశారు. వారి అరెస్ట్‌కు సంబంధించి చాలా విషయాలను అధికారులు తెలియజేయలేదు. 

తక్కువ కాలంలోనే శక్తిమంతంగా.. 

70, 80వ దశకంలో అక్రమ రవాణా ముఠాలు అమెరికాకు డ్రగ్స్ సరఫరా చేసేందుకు మెక్సికో, కొలంబియాలోపలు కార్టెల్ ప్రారంభమయ్యాయి. 90 దశకంలో కొలంబియా ముఠాల ప్రభావం క్షీణించడంతో మెక్సికన్ కార్టెల్‌లు తమ ఆధిపత్యాన్ని నిలుపుకున్నాయి. ఆ క్రమంలో పలు హింసాత్మక సంఘటనలు జరిగాయి. 21 దశాబ్దం ప్రారంభంలో మాజీ సైనికాధికారులతో సైతం వీరు వైరుధ్యం పెంచుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ డ్రగ్ వినయోగంతో యువత మృత్యువాత పడుతున్నట్లు అమెరికా ఉన్నతాధికారులు వెల్లడించారు. వీరి అరెస్టుతో మెక్సికోలో అస్థిరత నెలకొవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితులు హింసకు దారితీయవచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

అసలేంటీ సినలోవా.. 

సినలోవా సంస్థను 1980లలో జాంబాడా, ఎల్‌చాపో కలిసి స్థాపించారు. మెక్సికో కేంద్రంగా అమెరికాకు మాదకద్రవ్యాల సరఫరా చేయడం మొదలుపెట్టారు. అనతి కాలంలోనే సినలోవా అతిపెద్ద కార్టెల్‌గా మారింది. అమెరికా వ్యాప్తంగా డ్రగ్స్ సరఫరా చేయడంలో పూర్తి నియంత్రణ సాధించింది. అంతేకాకుండా మెక్సికోలో హింసాత్మక గ్రూపుగానూ అవతరించింది. సినలోవా సరఫరా చేస్తోన్న సింథటిక్ డ్రగ్స్, ఫెంటానిల్ వల్ల అమెరికాలో ఏటా లక్ష మంది చనిపోతున్నట్లు నివేదికలు వెలువడ్డాయి. దీంతో జాంబాడాపై అమెరికా ప్రభుత్వం గురిపెట్టింది.