calender_icon.png 3 April, 2025 | 8:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెట్రో మరో‘సారి’..

02-04-2025 11:39:22 PM

సాంకేతిక సమస్యలతో నిలిచిపోయిన మెట్రో రైలు..

ఇబ్బంది పడ్డ ప్రయాణికులు..

హైదరాబాద్ సిటీబ్యూరో (విజయక్రాంతి): హైదరాబాద్ మెట్రో రైలులో బుధవారం సాయంత్రం మరోసారి సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ఎల్‌బీనగర్ నుంచి మియాపూర్‌కు వెళుతున్న ఓ మెట్రో రైలు అసెంబ్లీ మెట్రో స్టేషన్ వద్ద నిలిచిపోయింది. దీంతో దాదాపు 15 నిమిషాల పాటు మెట్రో సేవలకు అంతరాయం ఏర్పడింది. మెట్రోలో సమస్య తలెత్తడంతో ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందిపడ్డారు. మెట్రో సిబ్బంది వెంటనే సమస్యను పరిష్కరించడంతో తర్వాత మెట్రో సేవలు యథావిధిగా కొనసాగాయి. దీంతో అధికారులు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా ప్రతీ రెండు నెలలకోసారి మెట్రో రైలు సర్వీసులో సమస్యలు తలెత్తడం పరిపాటిగా మారిందని ప్రయాణికులు విమర్శిస్తున్నారు.