calender_icon.png 5 November, 2024 | 9:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెట్రో రైలుకు అంతరాయం

05-11-2024 12:38:00 AM

  1. విద్యుత్ ఫీడర్ ఛానల్‌లో సమస్య        
  2. నాగోల్- రాయదుర్గం రూట్‌లో నిలిచిన మెట్రో రైలు 
  3. ఇబ్బందులకు గురైన ప్రయాణికులు  

 హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 4 (విజయక్రాంతి): నగరంలో నిత్యం వేలాది మంది ప్రయాణించే మెట్రో రైలు సర్వీసులు ఒక్కసారిగా నిలిచిపోయాయి. విద్యుత్ ఫీడర్ ఛానల్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో నాగోల్- రాయదుర్గం రూట్ (బ్లూ లైన్)లో బేగంపూట సమీపంలో సోమవారం ఉదయం మెట్రో రైలు దాదాపు 15 నిమిషాల పాటు నిలిచిపోయింది. 

ఈ ప్రభావంతో ఎల్‌బీ నగర్ నుంచి మియాపూర్ (రెడ్ లైన్) వెళ్లే పలు మెట్రో సర్వీసులకు సైతం అంతరాయం కలిగింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. దీపావళి, వారాంతపు సెలవులు ముగియడంతో ఊళ్ల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో నగరానికి రావడంతో మెట్రో స్టేషన్లు కిటకిటలాడాయి.

బేగంపేట సమీపంలో మెట్రో రైలు నిలిచిపోవడంతో అమీర్‌పేట, మియాపూర్, నాగోల్ రూట్‌లో మెట్రో రైళ్లు నిలియిపోయినట్టు మెట్రో రైలు ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. అనంతరం సాంకేతిక సమస్యను పరిష్కరించి రాకపోకలను పునరుద్ధరించినట్లు వెల్లడించారు.